AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Tips: యోగా, ప్రాణాయామం మొదటిసారి చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి.. ఆరోగ్యానికి హానికరం

వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి, అయినప్పటికీ యోగాసనాలు లేదా ఏదైనా ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. దినచర్యలో భాగంగా యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చాలా మందికి తెలుసు. అయితే యోగా మొదటి సారిగా చేసే వారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రయోజనానికి బదులు నష్టం కలగవచ్చు.

Yoga Tips: యోగా, ప్రాణాయామం మొదటిసారి చేస్తున్నారా.. ఈ తప్పులు చేయకండి.. ఆరోగ్యానికి హానికరం
Yoga TipsImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Jul 07, 2024 | 12:44 PM

Share

యోగా మానవుని సంపూర్ణ ఆరోగ్యవంతంగా చేస్తుంది. మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే దినచర్యలో యోగా, కొంత ప్రాణాయామం చేయాలి. యోగా చేయడం ద్వారా శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మంచి అనుభూతి చెందుతారు. వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి, అయినప్పటికీ యోగాసనాలు లేదా ఏదైనా ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

దినచర్యలో భాగంగా యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చాలా మందికి తెలుసు. అయితే యోగా మొదటి సారిగా చేసే వారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రయోజనానికి బదులు నష్టం కలగవచ్చు.

శరీరాన్ని బలవంతంగా వంచవద్దు

ప్రారంభంలో యోగా చేసేటప్పుడు శరీరాన్ని బలవంతంగా వంచడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేయడం వలన కండరాలలో ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా చాలా నొప్పిని అనుభవించవచ్చు. సులువైన యోగాసనాలతో ప్రారంభించి క్రమంగా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారిన తర్వాత కష్టమైన యోగాసనాలు చేయడానికి ప్రయత్నం చేయాలి.

ఇవి కూడా చదవండి

శ్వాసను నియంత్రించడం చాలా ముఖ్యం

శ్వాస పద్ధతులపై ఆధారపడిన కొన్ని యోగాసనాలు, ముఖ్యంగా ప్రాణాయామం ఉన్నాయి. సరిగ్గా శ్వాస తీసుకోవడం ఎలాగో తెలియకపోతే.. ప్రాణాయామం మీకు ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది. అందుకే ప్రాణాయామం చేయడం మొదటి సారి అయితే కొన్ని రోజులు నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

తినడం, త్రాగే సమయంపై శ్రద్ధ చూపించాలి.

అది వర్కవుట్ అయినా లేదా యోగా అయినా భోజనం తర్వాత, భోజనానికి ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా ముఖ్యం. ఎవరైనా యోగా చేయబోతున్నట్లయితే ఎక్కువగా ఖాళీ కడుపుతో చేయడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఉదయం ఫ్రెష్ అప్ అయ్యాక యోగా చేయాలి.. సాయంత్రం కూడా యోగా చేస్తుంటే.. ఎక్కువ ఆహారాన్ని తీసుకోకండి. యోగా , ఆహారం మధ్య దాదాపు రెండు నుండి రెండున్నర గంటల గ్యాప్ ఉండాలి.

వార్మప్ చేసే అలవాటు

యోగా లేదా వ్యాయామం చేసే ముందు ఖచ్చితంగా స్ట్రెచింగ్ లేదా వార్మప్ చేయాలి. ఇలా చేయడం వలన కండరాలు వదులు అవుతాయి. యోగా చేస్తున్నప్పుడు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ విధంగా కొన్ని చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా యోగా సెషన్‌ను పూర్తి చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..