AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Juice Benefits: ఖాళీ కడుపుతో అరగ్లాసు ఉల్లి రసం తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

రోజూ ఇలా వాడుతూ ఉంటే త్వరలోనే కిడ్నీ రాళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి. అలాగే ఖాళీ కడుపుతో ఉల్లి రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఉల్లిపాయలో కాల్షియం మెండుగా ఉంటుంది.కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. మ‌ధుమేహం ఉన్న వారు ఖాళీ క‌డుపుతో తేనె క‌ల‌ప‌కుండా ఉల్లి ర‌సం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

Onion Juice Benefits: ఖాళీ కడుపుతో అరగ్లాసు ఉల్లి రసం తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Onion
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jul 08, 2024 | 8:36 PM

Share

Onion Juice Benefits: ఉల్లిపాయ రసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఉల్లిపాయ రసంలో యాంటీ అలర్జీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉల్లిపాయ రసం రక్తపోటును తగ్గించడంలో, బరువును కంట్రోల్‌ చేయడం, శరీరం నుండి నిర్విషీకరణలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

దంతాలు,చిగుళ్ళు:

ఉల్లిపాయ రసం దంతాలు, చిగుళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దంతాలు, చిగుళ్ళలో నొప్పిని బలపరచడమే కాకుండా ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం రోజూ ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రక్తపోటు:

రక్తపోటును నియంత్రించడంలో ఉల్లిపాయ రసం చాలా మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, అధిక రక్తపోటు ఉన్నవారికి దీని వినియోగం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి:

ఉల్లిపాయ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మారుతున్న సీజన్లలో దీనిని తీసుకోవడం ద్వారా, సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

బరువు తగ్గడం:

బరువు తగ్గడానికి ఉల్లిపాయ రసం మంచిది. దీన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

వాపు:

ఉల్లిపాయ రసం తాగడం వల్ల శరీరానికి శక్తినివ్వడమే కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శరీరం నుండి వాపును తొలగించడంలో సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌:

ఖాళీ క‌డుపుతో ఉల్లి ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల రక్తంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని బలోపేతం చేయడంలో మీకు సహాయపడతాయి.

తయారీ విధానం:

దీని కోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారి చాలా మంచిది. రోజూ ఇలా వాడుతూ ఉంటే త్వరలోనే కిడ్నీ రాళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి.

అలాగే ఖాళీ కడుపుతో ఉల్లి రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఉల్లిపాయలో కాల్షియం మెండుగా ఉంటుంది.కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. మ‌ధుమేహం ఉన్న వారు ఖాళీ క‌డుపుతో తేనె క‌ల‌ప‌కుండా ఉల్లి ర‌సం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే..
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే..