Dahi Bhindi Curry: రాజస్థాన్ ఫేమస్ రెసిపీ దహీ భిండీ కర్రీ.. ఎందులోకైనా సూపర్ అంతే!

కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిని కూడా తరచూ తింటూ ఉంటారు. అయితే కర్రీల కంటే వేపుళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ సార్లు ఇలా తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. తినడం నచ్చదు. కానీ బెండకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి కొత్తగా వండాలి అనుకునేవారికి ఈ రెసిపీని ట్రై చేయండి. అదే దహీ భిండీ కర్రీ. రాజస్థానీ స్టైల్‌లో ఉండే ఈ కర్రీ. చాలా రుచిగా ఉంటుంది. అందరికీ తప్పకుండా..

Dahi Bhindi Curry: రాజస్థాన్ ఫేమస్ రెసిపీ దహీ భిండీ కర్రీ.. ఎందులోకైనా సూపర్ అంతే!
Dahi Bhindi Curry
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 08, 2024 | 8:47 PM

కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిని కూడా తరచూ తింటూ ఉంటారు. అయితే కర్రీల కంటే వేపుళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ సార్లు ఇలా తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. తినడం నచ్చదు. కానీ బెండకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి కొత్తగా వండాలి అనుకునేవారికి ఈ రెసిపీని ట్రై చేయండి. అదే దహీ భిండీ కర్రీ. రాజస్థానీ స్టైల్‌లో ఉండే ఈ కర్రీ. చాలా రుచిగా ఉంటుంది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దాబాల్లో కూడా ఎక్కువగా ఈ కర్రీ తయారు చేస్తూ ఉంటారు. చపాతీ, పుల్గా, రైస్‌లో తింటే ఎంతో బావుంటుంది. మరి ఈ కర్రీ ఎలా తయారు చేస్తారు? దహీ భిండీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

దహీ భిండీ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

బెండకాయలు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ధనియాల పొడి, మెంతులు, ఇంగువ పొడి, కరివేపాకు, కొత్తి మీర.

దహీ భిండీ కర్రీ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్, కొద్దిగా నెయ్యి వేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి చల్లార నివ్వాలి. ఉల్లి పాయ ముక్కలు చల్లా రాక పేస్టు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెండకాయ ముక్కలను మధ్యలోకి కట్ చేసినవి వేసి వేయించాలి. ఇవి కూడా వేగా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ అదే కడాయిలో జీలకర్ర, కొద్దిగా సోంపు, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేయించాక.. ఉల్లి పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పులు ఇందులోనే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి వేగాక బెండకాయలను కూడా వేసి కలపాలి. ఇవన్నీ వేగా కొద్దిగా నీరు వేసి ఉడికించాలి. ఇప్పుడు చిన్న కప్పులో కొద్దిగా పెరుగు తీసుకుని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. స్మూత్‌గా అయ్యాక బెండకాయ కూరలో వేసి కలపాలి. కర్రీ అంతా దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే దహీ భిండీ కర్రీ సిద్ధం.

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!