AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helping Hands : కొత్వాల్ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితి తెల్సుకొని చలించిపోయిన మంత్రి హరీశ్ రావు.. యుద్ధ ప్రాతిపదికన ఏంచేశారంటే. .!

కొవిడ్ కాటుకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. అయితే, అలాంటి కుటుంబాలు చెల్లాచెదురైపోకుండా.. ఆ అభాగ్యులను ఆదుకునేందుకు ఆపన్నహస్తమందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేకాదు, ఎంతో మంది మానవతామూర్తులు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.

Helping Hands : కొత్వాల్ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితి తెల్సుకొని చలించిపోయిన మంత్రి హరీశ్ రావు.. యుద్ధ ప్రాతిపదికన  ఏంచేశారంటే. .!
Harishrao Helping Hand
Venkata Narayana
|

Updated on: May 30, 2021 | 4:54 PM

Share

Telangana Minister Harish Rao : ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద విపత్తుగా పరిణమించింది కరోనా వైరస్ మహమ్మారి. కొవిడ్ కాటుకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. అయితే, అలాంటి కుటుంబాలు చెల్లాచెదురైపోకుండా.. ఆ అభాగ్యులను ఆదుకునేందుకు ఆపన్నహస్తమందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేకాదు, ఎంతో మంది మానవతామూర్తులు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తూ ఆయా కుటుంబాల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉదంతమే ఇప్పుడు సిద్దిపేటలో జరిగింది. నాయి బ్రాహ్మణుడు అయిన కొత్వాల్ శ్రీనివాస్ సిద్దిపేట లోనే కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగించేవాడు. శ్రీనివాస్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందమైన కుటుంబంతో హాయిగా జీవిస్తూ ఉన్న ఆ పచ్చని సంసారాన్ని కరోనా కాటువేసి అతలాకుతలం చేసింది. వారం క్రితం శ్రీనివాస్ కు కరోనా సోకగా, హోమ్ ఐసోలేషన్ లో వుండగానే ఆరోగ్యం విషమించి రెండు రోజుల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబం మొత్తం వీధిన పడింది. సొంత ఇల్లు లేకపోవటంతో శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత అద్దె ఇంట్లోనే ఉన్నారు. శ్రీనివాస్ భార్య వద్ద చిల్లి గవ్వ కూడా లేకపోవటంతో ఇంటి ఓనర్ కూడా ఇంట్లో నుండి పంపించి వేశాడు. మృతుడి భార్య పిల్లలకు దిక్కుతోచక ఎక్కడికి వెళ్ళాలో తెలియక భర్త అంత్యక్రియలు జరిగిన స్మశానంలోనే ఉండసాగారు.

ఈ విషయం మంత్రి హరీశ్ రావుకు చేరింది. చలించిపోయిన మంత్రి హరీశ్ రావు వెంటనే వాళ్లకి ఉండటానికి ఇల్లు, తగిన నిత్యావసరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో యుద్ధప్రాతిపదికన ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేశారు. శ్రీనివాస్ భార్యాబిడ్డల్ని కొత్త డబుల్ బెడ్ రూం ఇంట్లోకి తరలించారు. అంతేగాక, హరీశ్ రావు స్వయంగా ఫోన్ చేసి ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని.. పిల్లలను ఉచితంగా చదివించే బాధ్యత తనేదేనని ఆ తల్లికి మాట ఇచ్చారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులను అందజేశారు. హరీశ్ రావు చేసిన ఈ సహాయం ఎంతో అపురూపమైందని, తన బిడ్డలకు కూడు, గూడు, విద్య కల్పించిన హరీశ్ కు తాను, తమ పిల్లలు ఎంతో ఋణపడి ఉంటామని శ్రీనివాస్ భార్య ధన్యవాదాలు తెలిపారు.

Read also : Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో కేబినెట్ భేటీ మీదే అందరి దృష్టి, ఎలాంటి నిర్ణయం వస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ