AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teaching in Forest: కరోనా తెచ్చిన కొత్త పాఠశాల.. కారుడవుల్లో కాంతి రేఖ.. ఇంటి వద్దనే విద్యా బోధన

కరోనా మహమ్మారి రెండేళ్లుగా విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతున్నాయి. క్లాసులు లేవు, పాఠాలు లేవు.. బడి గంటలు అసలే లేవు.. ప్రస్తుతం అన్నీ ఆన్ లైన్ లోనే కొనసాగుతున్నాయి.

Teaching in Forest: కరోనా తెచ్చిన కొత్త పాఠశాల.. కారుడవుల్లో కాంతి రేఖ.. ఇంటి వద్దనే విద్యా బోధన
Teaching In Karnataka Forest
Balaraju Goud
|

Updated on: Mar 31, 2021 | 5:46 PM

Share

teachers in karnataka: కరోనా మహమ్మారి రెండేళ్లుగా విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతున్నాయి. క్లాసులు లేవు, పాఠాలు లేవు.. బడి గంటలు అసలే లేవు.. ప్రస్తుతం అన్నీ ఆన్ లైన్ లోనే కొనసాగుతున్నాయి. పిల్లలకు కూడా ఆన్ లైన్ పాఠాలకు అలవాటు పడిపోయారు. ఉపాధ్యాయులు సాంకేతిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్లాసుల ద్వారానే విద్యాబోధన సాగుతోంది. అయితే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ ఉన్నవారే వీటిని వినే పరిస్థితి ఏర్పడుతోంది.

అయితే కరోనా కారణంగా స్కూళ్లు మూతబడ్డా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కర్ణాటకకు చెందిన ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచన చేసింది. విద్యార్థులందరికీ పాఠాలు మిస్ కాకుండా చర్యలు చేపట్టింది. చిక్ మంగళూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు టీచర్లు.. విద్యార్థుల ఇంటి వద్దనే వారికి విద్యను బోధిస్తూ నిజమైన టీచర్లు ఎలా ఉండాలో అందరికీ చాటి చెబుతున్నారు. అదీ కూడా కాలి బాట లేని మారుమూల పల్లెలకు వెళ్లి పాఠాలు చెబుతూ అందరి మన్నలు పొందుతున్నారు.

చిక్ మంగళూరు తాలూకాలోని దట్టమైన అడవిలో ఉన్న ఓ చిన్న పల్లెటూరు. సాధారణంగానే ఇక్కడ వసతులు చాలా తక్కువ. ఇక కరోనా వచ్చిన తర్వాత వీరికి అందే సౌకర్యాలు చాలా తగ్గిపోయాయి. ఈ గ్రామంలో 50 నుంచి 60 ఇళ్లున్నాయి. ఇక్కడి నుంచి 30 మంది పిల్లలు చదువుకునే వయసులో ఉన్నారు. వారంతా కరోనాకి ముందు స్కూల్ కి వెళ్లి చదువుకునేవారు. కానీ, ఆ తర్వాత స్కూళ్లు మూతబడడంతో అమ్మాయిలు ఇంటి దగ్గర ఆడుకోవడం చేస్తుంటే అబ్బాయిలు చేపల వేటకు వెళ్లడం, చెరువులో ఈత కొట్టడం, ఇతరత్రా ఆటల్లో మునిగిపోయారు. దీంతో వచ్చి చదువును కాస్త మరిచిపోతున్నారు.

కూలి పనులకు వెళ్లే వారి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆలోచిస్తూ కంగారు పడేవారు. కానీ, ఈ ఇద్దరు టీచర్లు పిల్లలను ఎక్కడికీ వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారికి చదువు కూడా చెబుతున్నారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా తీర్థ కుమార్, సౌమ్య అనే ఈ ఇద్దరు టీచర్లు గ్రామం ఏడెనిమిది సార్లు తిరిగి ఎవరూ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. తమ పిల్లల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న శ్రద్దను చూసి గ్రామస్తులు మురిసిపోతున్నారు. అధికారులకు పట్టని సమస్యను ఉపాధ్యాయులు తీరుస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.

గతంలో కర్ణాటక ప్రభుత్వం విద్యాగామ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థుల ఇళ్లకే టీచర్లు వెళ్లి వారికి చదువు చెప్పి వారికి విద్య పట్ల ఆసక్తిని పెంచి స్కూళ్లలో చేరేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. దీని నుంచి స్పూర్తి పొందిన ఈ టీచర్లు కలిసి ఓ చక్కటి నిర్ణయం తీసుకున్నారు. అడవిలోని ఈ ఊరికి రోజూ వెళ్లి అక్కడి పిల్లలకు చదువు చెప్పడానికి వారు నిర్ణయించుకున్నారు.

వీరు గ్రామమంతా తిరుగుతూ ప్రతి ఇంట్లోని విద్యార్థికి అరగంట పాటు చదువు చెబుతారు. ఆ తర్వాత వారికి హోమ్ వర్క్ ఇచ్చి వారు రోజంతా బిజీగా ఉండేలా చూస్తున్నారు. ఇలా రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరు ఇలా ప్రతి ఇంటికి వెళ్లి చదువు చెబుతున్నారు. దీనికోసం ప్రతి ఇంటి వద్దా ఒక బోర్డును కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ రోజూ అందరు విద్యార్థుల వద్దకు వెళ్లడం ఇబ్బందైతే రోజు విడిచి రోజు వెళ్లేలా వీరు ప్లాన్ చేసుకుంటున్నారు.

వీరి సేవల గురించి ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. మేం ఉదయాన్నే పనికి వెళ్లిపోతాం. ఆడ, మగ ఇద్దరూ పనిచేస్తే కానీ మా ఇల్లు గడవదు. ఇలాంటప్పుడు మా పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లేందుకు చాలా భయపడేవాళ్లం. ఒకసారి పనికి వెళ్లే సాయంత్రం చీకటి పడే సమయానికి గానీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే పిల్లలు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారో.. అడవిలోకి గానీ వెళ్లారేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు మేం నిశ్చింతగా ఉంటున్నాం. కేవలం వారి భద్రత గురించే కాదు.. వారికి ఇంటి దగ్గరే చదువు అందుతోందని కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది అని వెల్లడించారు.

Read Also…  April Fools’ Day 2021: సరదాగా జరుపుకునే ఏప్రిల్ పూల్స్ డే .. ఎప్పుడు.. ఎక్కడ ఎలా మొదలైందో తెలుసా..?