April Fools’ Day 2021: సరదాగా జరుపుకునే ఏప్రిల్ పూల్స్ డే .. ఎప్పుడు.. ఎక్కడ ఎలా మొదలైందో తెలుసా..?

April Fools' Day 2021: ఫూల్స్ డే అంటూ ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత..

April Fools' Day 2021: సరదాగా జరుపుకునే ఏప్రిల్ పూల్స్ డే .. ఎప్పుడు.. ఎక్కడ ఎలా మొదలైందో తెలుసా..?
April Fools Day
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2021 | 5:11 PM

April Fools’ Day 2021: ఫూల్స్ డే అంటూ ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ఏప్రిల్ ఫూల్స్ గా పిలుస్తూ చిన్న పిల్లల్లా సంతోష పడతారు. ఒకొక్కసారి ఏప్రిల్ ఫూల్స్ ని చేయడానికి కొన్ని వార్తా పత్రికలు, మ్యాగజీన్లు కూడా అసత్య కథనాలను ప్రచారం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. మళ్ళీ మర్నాడు ఆ వార్తపై వివరణ ఇవ్వడం పరిపాటి. ఈ ఏప్రిల్ ఫుల్ డే 19 వ శతాబ్దం నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. దీనిని సరదాగా జరుపుకుంటారు కానీ సెలవుదినంగా పాటించరు. అయితే ఈ ఏప్రిల్ ఫూల్స్ డే ని మొదట ఐరోపాలో జరుపుకున్నారు. కాలక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపించింది.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పోప్ గ్రెగొరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఏప్రిల్ ఫుల్ డే ను జరుపుకోవడం ప్రారంభమైంది. ఐతే కొత్త క్యాలెండర్ జనవరి 1 నుండి 1952 లో ప్రారంభమవుతుందని తీర్పు ఇచ్చింది. అయితే 1952 కు ముందు యురేపియన్ కంట్రీస్ లో మార్చి చివరిలో నూతన సంవత్సరాన్నిజరుపుకునే వారు. అయితే నూతన సంవత్సర మార్పుని చాలా మంది అంగీకరించలేదు.. ఇప్పటికీ చాలా మంది జూలియన్ క్యాలెండర్ ను అనుసరిస్తూనే ఉన్నారు. ఐతే కొత్త క్యాలెండర్ ను అంగీకరించి అమలు చేసిన మొదటి దేశం ఫ్యాన్స్..

ఈ విధంగా, కొత్త క్యాలెండర్‌ను అనుసరించకుండా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించే వారిని తెలివి తక్కువగా భావించి వారిని ఎగతాళి వేసేవారని ఓ కథనం .. ఆరోజు జోకులు, నవ్వులతో నిండిపోయేది. అలా ఆనందం అందించింది, దీంతో ఏడాదిలో ఒక్కరోజైనా సంతోషంగా ఉండాలి.. అనుకునేవారు ఏప్రిల్ 1కోసం ఎదురుచూసేవారు. అలా మొదలైన ఫూల్స్ డే ఇప్పుడు కొన్ని దేశాల్లో సంప్రదాయంగా మారిపోయింది.

Also Read: New Wage Code Deferred: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త వేతన చట్టం తాత్కాలికంగా నిలిపివేత.. యధావిధిగా శాలరీ అందజేత Mahesh Babu Dupe: పిల్లలకు పాలు కొనలేని దీనస్థితిలో మహేష్ బాబు డూప్.. పని ఇచ్చి ఆదుకోమంటూ వినతి