AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu Dupe: పిల్లలకు పాలు కొనలేని దీనస్థితిలో మహేష్ బాబు డూప్.. పని ఇచ్చి ఆదుకోమంటూ వినతి

Mahesh Babu Dupe:ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటీనటులను పోలిన వ్యక్తులను చూస్తూనే ఉంటున్నాం.. అయితే కొంతమంది హీరోల్లా కనిపించే వ్యక్తులను డూప్స్ గా షూటింగ్ సమయంలో వాడుకుంటారు..

Mahesh Babu Dupe: పిల్లలకు పాలు కొనలేని దీనస్థితిలో మహేష్ బాబు డూప్.. పని ఇచ్చి ఆదుకోమంటూ వినతి
Mahesh Babu Dupe Srinu
Surya Kala
|

Updated on: Mar 31, 2021 | 4:46 PM

Share

Mahesh Babu Dupe: ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన నమ్మకం. అది ఎంత నిజమో తెలియదు కానీ.. కొన్ని కొన్ని సార్లు ఒకొక్కరిని చూస్తే.. ఎవరినో ఎక్కడో చేసినట్లుంది అని అనుకుంటాం. ఇక ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటీనటులను పోలిన వ్యక్తులను చూస్తూనే ఉంటున్నాం.. అయితే కొంతమంది హీరోల్లా కనిపించే వ్యక్తులను డూప్స్ గా షూటింగ్ సమయంలో వాడుకుంటారు అన్న సంగతి మనకి తెలిసిందే. అలాంటి డూప్స్ తో రిస్కీ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మరికొన్ని సమయాల్లో హీరో డ్యూయెల్ రోల్స్ చేస్తుంటే డుప్స్ తో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వెండి తెరపై హీరోలా కనిపించే ఈ డూప్స్ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో తాజాగా మహేష్ బాబు లా కనిపించే జూనియర్ ఆర్టిస్టు శ్రీను చెప్పాడు.

చూడడానికి కొంచెం మహేష్ బాబు పోలికలతో ఉండి.. దూరం నుంచి చూస్తే మహేష్ బాబు అనిపిస్తాడు శ్రీను. పలు టీవీ షోస్ లో కూడా పాల్గొన్నాడు. అయితే చేతి నిండా పని ఉన్న సమయంలో అంతంత మాత్రంగా గడిచే తమ జీవితం కరోనా దెబ్బతో అతకుతలం అయ్యిందని వాపోతున్నాడు. అంతేకాదు.. తనకు నటన తప్ప వేరేది రాదని.. దీనినే నమ్ముకుని జీవిస్తున్నట్లు చెప్పాడు. ఒక్క ప్రోగ్రాం చేస్తే.. రూ. 2 వేలు ఇస్తారు..అలా నెలకు ఓ 5 దొరికితే చేతికి పదివేలు వస్తాయి. ఇల్లు గడిచేది.. ఐతే కరోనా నేపథ్యంలో చాలా వరకూ ప్రోగ్రామ్స్ ఉండడం లేదు.. దీంతో వచ్చే రాబడి కూడా లేకుండా పోయింది. దీంతో పెళ్ళాం పిల్లలని పోషించలేక పోతున్నా.. పస్తులు ఉంచుతున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు శ్రీను.

తనకు ముగ్గురు పిల్లలని పెద్దబాబుకి 9 ఏళ్ళు అయితే పాలు తాగే వయసులో ఇద్దరు పిల్లలు ఉన్నారని.. వారు కవలలని చెప్పాడు శ్రీను. అద్దె ఇల్లు.. రాబడి తక్కువ.. ఖర్చులు ఎక్కువ .. దీంతో పిల్లలకు కనీసం పాలు కూడా సరిగ్గా పోయలేకపోతున్నటున్నాడు.. తాను పస్తులు ఉండి పిల్లల ఆకలి తీరుస్తున్నట్లు చెప్పాడు. తానే కాదని.. సినీ పరిశ్రమలో తనలా చాలా మంది ఉన్నారని వాపోతున్నాడు. తమని ఆదుకునేవారు లేరని.. ఏ రోజు పని దొరికితే ఆరోజే సంతోషపడాలి అంతే కానీ.. తమ జీవితాల్లో మంచి రోజులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అయితే తనను కరోనా సమయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అదుకున్నారని చెప్పాడు. మహేష్ బాబుకి డూప్‌గా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. రాజకుమారుడు సినిమా అప్పటి నుంచి మహేష్ బాబు డూప్‌గా చేస్తున్నానని తనకు పని ఇచ్చి ఆదుకోమని ఇండస్ట్రీలోని నిర్మాతలను కోరుతున్నాడు.

Also Read: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త వేతన చట్టం తాత్కాలికంగా నిలిపివేత.. యధావిధిగా శాలరీ అందజేత

Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!