Sankranthi 2022: మకర సంక్రాంతి పండగ ఎప్పుడు? జనవరి 14? లేక 15వ తేదీనా? పంచాంగ కర్తలు ఏమంటున్నారు?

మకర సంక్రాంతి పండగ జరుపుకునే విషయంలో మరోసారి గందరగోళం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక తేదీన ప్రకటిస్తే, అది తప్పు అంటున్నారు పంచాంగ కర్తలు.

Sankranthi 2022: మకర సంక్రాంతి పండగ ఎప్పుడు? జనవరి 14? లేక 15వ తేదీనా? పంచాంగ కర్తలు ఏమంటున్నారు?
Sankranthi
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2022 | 7:01 PM

Sankranthi Festival 2022: మకర సంక్రాంతి పండగ జరుపుకునే విషయంలో మరోసారి గందరగోళం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక తేదీన ప్రకటిస్తే, అది తప్పు అంటున్నారు పంచాంగ కర్తలు. సంక్రాంతి(Sankranthi ) పండగ తేదీ విషయంలో మరోసారి అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే జనవరి 14వ తేదీనే జరుపుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు జనవరి 15వ తేదీ సంక్రాంతి పండగ అని ప్రకటించడంతో దానికి అనుగుణంగా ప్రజలు కూడా పండగ ఏర్పాట్లలో మునిగిపోయారు. నగరాల్లో ఉన్న వారు కూడా పల్లెబాట పట్టారు. ఇప్పటికే ఏపీలోని కోనసీమ లాంటి ప్రాంతాల్లో పండగ సంబరాలు ఊపందుకున్నాయి. ముగ్గురు పోటీలు, ఎడ్ల పందేలు జోరుగా జరుగుతున్నాయి. విద్యార్థులకు స్కూల్స్ సెలవులు ఇవ్వడంతో పిల్లలు గ్రామాలలో భోగిమంట వేసేందుకు దుంగలు రెడీ చేసుకుంటున్నారు. మరోపక్క భోగి పిడకల దండలు ఇప్పటికే రెడీ చేసారు.

అయితే మకర సంక్రాంతి పండగ తేదీపై మాత్రం అయోమయస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పుడు పండగ జరుపుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. దేశంలోని 27 రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్రాంతి పండగను జనవరి 14వ తేదీనే జరుపుకుంటున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం జనవరి 15వ తేదీన పండగ జరుపుకోవాలని నిర్ణయించాయి. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

దృగ్గణిత పంచాంగం ప్రకారం జనవరి 14వ తేదీ 2 గంటల 29 నిమిషాలకు సంక్రాంతి ప్రవేశిస్తుందని, అందుకే 14వ తేదీనే జరుపుకోవాలని పంచాంగకర్త శ్రీనివాస గార్గేయ సూచిస్తున్నారు. దీంతో 14వ తేదీనే మకర సంక్రాంతిగా ప్రకటించాలని సూచిస్తున్నారు. పూర్వ గణిత పంచాంగ కర్త లకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పదవులను ఇచ్చి పంచాంగలను మార్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు .

పంచాంగకర్తల సూచనల ప్రకారం జనవరి 14వ తేదీన సంక్రాంతి పండగ జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటిస్తాయా ? లేక జనవరి 15వ తేదీనే నిర్వహించుకోవాలని సూచిస్తాయా ? అనేది చూడాలి.

Read Also….  PM Security Breach: పంజాబ్‌ పర్యటనలో ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!