Investments: పదవీ విరమణ తరువాత ఈ 5 ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. శేష జీవితం హాయిగా గడిపేయండి..

పదవి విరమణకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ప్లాన్స్ చేసుకోండి. ఎందుకంటే.. విధుల్లో ఉన్నప్పుడే భవిష్యత్..

Investments: పదవీ విరమణ తరువాత ఈ 5 ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. శేష జీవితం హాయిగా గడిపేయండి..
Pension
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 23, 2022 | 7:22 AM

పదవి విరమణకు సంబంధించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ప్లాన్స్ చేసుకోండి. ఎందుకంటే.. విధుల్లో ఉన్నప్పుడే భవిష్యత్ కోసం పెట్టడం ప్రారంభించాలి. అది మీ వృద్ధాప్యంలో ఆసరగా ఉంటుంది. శేష జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఆస్కారం ఇస్తుంది. అందుకే ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ మనం 5 కీలక పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ ప్లానింగ్ చేయవచ్చు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..

రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ప్రభుత్వ, సురక్షితమైన స్థలంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింపుల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు కాదు 40 ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టాలి. అలా చేస్తే జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యం సమయంలో పాలసీ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పాలసీని సరెండర్ చేసినప్పుడు, 95 శాతం మీకు తిరిగి వస్తుంది. ఇది కాకుండా, ఈ పథకంపై రుణం కూడా తీసుకోవచ్చు.

నేషనల్ పెన్షన్ పథకం..

ట్యాక్స్ ఫ్రెండ్లీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నేషనల్ పెన్షన్ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం కూడా సురక్షితమైనది. పదవీ విరమణ సమయంలో శాంతి మరియు సౌకర్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. 3 సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రీమియం చెల్లించిన తర్వాత.. దాని నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీకి ముందు మొత్తం డిపాజిట్ మొత్తంలో 25% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అటల్ పెన్షన్ యోజన..

అటల్ పెన్షన్ యోజన కింద, 60 సంవత్సరాలు నిండిన తర్వాత, ప్రతి నెలా 1000 నుండి 5000 రూపాయల వరకు పెన్షన్ లభిస్తుంది. ఇందులో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వ్యక్తి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం కింద, ప్రభుత్వం చందాదారుల సహకారంలో 50 శాతం లేదా ప్రతి సంవత్సరం రూ. 1000, ఏది తక్కువైతే అది జమ చేస్తుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన..

సురక్షితమైన ప్రదేశంలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ప్రధాన మంత్రి వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టొచ్చు. పదవీ విరమణ తర్వాత ఇంట్లో కూర్చొని నెలవారీ పెన్షన్ కావాలనుకుంటే.. ఈ పథకం కింద 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ లభిస్తుంది. అంటే మీరు రూ. 15 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే, 8 శాతం చొప్పున వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 1.20 లక్షలు అవుతుంది. ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా పొందుతారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా సురక్షితమైన ప్రభుత్వ పథకం. మీరు ఇందులో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, ఈ పథకం ప్రతి సంవత్సరం 7.4% రాబడిని అందిస్తోంది. ఈ పథకంలో రూ. 1000 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత దానిని మరింత పొడిగించుకోవచ్చు. ఈ పథకం 60 ఏళ్లు పైబడిన వారందరికీ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
వామ్మో..! ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు..!
వామ్మో..! ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు..!
ప్రియుడి చిత్రహింసలతో విసిగి ఎయిర్ ఇండియా పైలట్ ఆత్మహత్య,
ప్రియుడి చిత్రహింసలతో విసిగి ఎయిర్ ఇండియా పైలట్ ఆత్మహత్య,
MPC, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు రేపట్నుంచి కౌన్సెలింగ్
MPC, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు రేపట్నుంచి కౌన్సెలింగ్
మన జేబులో ఉండే కరెన్సీ నోట్ల తయారీ అదిరే టెక్నాలజీ
మన జేబులో ఉండే కరెన్సీ నోట్ల తయారీ అదిరే టెక్నాలజీ
క్రేజ్ పీక్.. అవకాశాలు వీక్.. ఆ భామలు క్యాష్‌ చేసుకోలేకపోతున్నారా
క్రేజ్ పీక్.. అవకాశాలు వీక్.. ఆ భామలు క్యాష్‌ చేసుకోలేకపోతున్నారా
వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్
వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్
ఏపీలో కేసుల విషయంలో నలిగిపోతున్న అధికారులు.. వైసీపీ వార్నింగ్
ఏపీలో కేసుల విషయంలో నలిగిపోతున్న అధికారులు.. వైసీపీ వార్నింగ్
2025లో రాశిని మార్చుకోనున్న రాహుకేతులు..వీరు పట్టిందల్లా బంగారమే
2025లో రాశిని మార్చుకోనున్న రాహుకేతులు..వీరు పట్టిందల్లా బంగారమే
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే వీటిని తినకండి
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే వీటిని తినకండి