Andhra Pradesh: ఫలించిన గిరిజన బిడ్డల కల.. టీవీ9 కథనంతో కదిలిన జిల్లా యంత్రాంగం..!

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తెంగిల బంద స్కూలు విద్యార్థుల అవస్థలపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. గ్రామాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా గెడ్డలు దాటలేక గంగవరం స్కూల్ కు వెళ్ళలేక పోతున్నారు గిరిజన విద్యార్థులు.

Andhra Pradesh: ఫలించిన గిరిజన బిడ్డల కల.. టీవీ9 కథనంతో కదిలిన జిల్లా యంత్రాంగం..!
Tv9 Effect
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 30, 2024 | 1:37 PM

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తెంగిల బంద స్కూలు విద్యార్థుల అవస్థలపై టీవీ9 ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. గ్రామాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా గెడ్డలు దాటలేక గంగవరం స్కూల్ కు వెళ్ళలేక పోతున్నారు గిరిజన విద్యార్థులు. ప్రమాదకర గడ్డలు దాటి రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్లలేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో స్కూలుకు వెళ్లలేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

విద్యార్థుల అవస్థలపై గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి స్కూలు టీచర్‌ను నియమిస్తే, తామే స్కూలు షెడ్డు నిర్మాణం చేసుకుంటామని గిరిజనుల మొర పెట్టుకున్నారు. వర్షాల సందర్భంగా గడ్డలు పొంగుతున్న సమయంలో వాటిని దాటి వెళ్లలేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై టీవీ9 సమాజం దృష్టికి తీసుకెళ్లింది. విద్యార్థుల పడుతున్న పాట్లను కళ్లకు కట్టినట్లు చూపించింది. జూన్ నెల 27వ తేదీన గిరిజన బిడ్డల బాధలను ప్రసారం చేసింది.

దీనిపై స్పందించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెంటనే అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. సమస్యను వెరిఫై చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెంగిళ్ళబంద గ్రామానికి వెళ్లారు విద్యాశాఖ అధికారులు. వెంటనే గంగవరం నుంచి ఒక టీచర్‌ను తెంగిళ్ళబందకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ప్రత్యామ్నాయ పాఠశాల ఏర్పాటు విషయంలో కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని పాఠశాల, గ్రామానికి వస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక చొరవ తీసుకున్న టీవీ9 కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెంగిలబంద గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…