Devil Fish: గిరిజనుల వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే జడుసుకుంటారు..!
ఇటీవల మత్స్యకారుల వలకు చిక్కుతున్న చేపలు భయ పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట వింత చేపలు వలకు చిక్కుతున్నాయి. అయితే వలకు పెద్ద చేపలు దొరికాయని సంతోషించేలోపే ఆ చేపల గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో గిరిజనుడి వలకు చేపలు చిక్కాయి.
ఇటీవల మత్స్యకారుల వలకు చిక్కుతున్న చేపలు భయ పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎక్కడో ఒక చోట వింత చేపలు వలకు చిక్కుతున్నాయి. అయితే వలకు పెద్ద చేపలు దొరికాయని సంతోషించేలోపే ఆ చేపల గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో గిరిజనుడి వలకు చేపలు చిక్కాయి. కిలో బరువు వుండే ఈ చేప వింతగా, భయం కలిగించేదిగా ఉండటంతో షాక్ అయ్యారు. సముద్రంలో కనిపించే చేపలు ఇక్కడ దొరకడంతో వాటిని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరులో చేపలు పట్టేందుకు వెళ్లారు బాలాజీ తండా గిరిజనులు. వల విసిరిన గిరిజనులకు సముద్ర జలాల్లో మాత్రం కనిపించే వింత రకం చేపలు లభించాయి. సముద్ర జలాల్లో మాత్రమే తిరిగే ఈ చేపలను అక్వేరియంల్లోనూ పెంచుతారని చెపుతున్నారు. స్థానికంగా వీటిని దెయ్యం చేపలుగా పిలుస్తుండగా, వరదల సమయాన ఆకేరు చెక్ డ్యామ్‌లోకి చేరినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.
చేపల రూపాన్ని బట్టి వీటిని దెయ్యం చేపగా కూడా పిలుస్తారు. వాటి చుట్టూ వుండే చేపలను గాయపరచి, చంపి తినడం ఈ చేపలకు అలవాటు. దీని కారణంగా దేశవాళీ చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదమని మత్స్యకారుడు చెబుతున్నారు. ఈ చేప ఉన్నచోట మిగతా చేపలు అంతరించిపోతాయంటున్నారు. ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట ఆక్వేరియంలో పెంచేందుకు మనవారు తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి దీని సంతతి పెరుగుతూ వస్తోంది.
దెయ్యం చేప భిన్న రూపం కలిగి ఉంటుంది. దీనికి పొలుసులుండవు. ఒళ్లంతా నల్లటి చారలు మాత్రమే ఉంటాయి. వీటిని సహజంగా వాడుక భాషలో దెయ్యం చేప, విమానం చేప అంటారు. ఈ చేపలు చెరువులోకి చేరాయంటే.. ఇక అంతే సంగతలు. ఈచేపలు చెరువుల్లోకి చేరితే ఇతర చేపల అభివృద్ధికి ఆటంకంగా మారుతాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వింత చేపలను గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…