AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అపూర్వ సత్కారం.. విద్యార్థుల ప్రేమకు కన్నీళ్లు పెట్టుకున్న టీచర్

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావిస్తుంటాం. విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి గురువు.

విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు అపూర్వ సత్కారం.. విద్యార్థుల ప్రేమకు కన్నీళ్లు పెట్టుకున్న టీచర్
Retired Teacher Felicitation
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 30, 2024 | 11:05 AM

Share

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావిస్తుంటాం. విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో జ్ఞాన మార్గం వైపు నడిపిస్తారు. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి గురువు. అలాంటి గురువుపై ప్రేమను చాటుకున్నారు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా తూము హనుమంతరావు పనిచేశారు. హనుమంతరావు ఎక్కడ పని చేసినా విద్యార్థులతో పెనవేసుకునే బంధం ఆయన సొంతం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, శిక్షణతో మెరుగులు అద్ది ఉన్నత స్థాయికి చేర్చారు. హోటళ్ళు, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటున్న చాలామంది విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చే వారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి మైదానంలో శిక్షణ ఇచ్చేవారు. తనకు వచ్చే వేతనంలో మూడో వంతు విద్యార్థుల ఉన్నతి కోసం ఖర్చు చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ హనుమంతరావుగా 39 సంవత్సరాల పాటు సర్వీసులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి, భువనగిరి, నూతనకల్ మండలాల్లో పనిచేశారు. ఆయన శిష్యరికంలో పోలీస్‌ శాఖలో డీఎస్పీ, సీఐ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా, వ్యాయామ ఉపాధ్యాయులుగా, మున్సిపల్‌ కమిషనర్, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు, ఇలా వివిధ హోదాలో ఎందరో స్థిరపడ్డారు.

ఉపాధ్యాయుడి రథాన్ని తాళ్లతో లాగిన విద్యార్థులు

ఉద్యోగం చేసిన వారు ఏదో ఒక రోజు పదవి విరమణ చేయాల్సిందే..! సూర్యాపేట జిల్లా నూతనకల్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హన్మంతరావు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు హన్మంతరావును విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉన్నతాధికారులకు పూలతో అలంకరించిన రథాన్ని లాగే వీడ్కోలు పలికే తరహాలో హనుమంతరావును ఘనంగా సన్మానించారు. హన్మంతరావు దంపతులను పాఠశాల నుంచి కార్యక్రమం నిర్వహించే వేదిక వద్దకు సుమారు కిలోమీటరు మేర పూర్వ విద్యార్థులు వాహనంలో పూలు చల్లుతూ, వ్యాన్ ను తాళ్లు కట్టి గ్రామంలో లాగుతూ వెళ్లారు. హన్మంతరావు దంపతులను పూలమాలలు, శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేసిన 600 మంది పూర్వ విద్యార్థులు తమ అనుబంధాన్ని పంచుకున్నారు.

సమాజంలో తమకంటూ ఒక స్థానం కల్పించిన గురువుగా ఆయన చరిత్రలో నిలిచి పోతారని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని , ఉద్వేగ క్షణాలని చూసి ఒక దశలో పదవీ విరమణ పొందుతున్న హనుమంతరావు సైతం కన్నీళ్ళు పెట్టుకున్నారు.

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్