Rare Tortoise: ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన తాబేలు.. ఎక్కడ పుట్టింది.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి
Rare Tortoise: ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల తాబేళ్లు ఉండగా, కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఓ తాబేలు అందరిని ఆశ్యర్యపరుస్తోంది. ఇది చాలా..

Rare Tortoise: ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల తాబేళ్లు ఉండగా, కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఓ తాబేలు అందరిని ఆశ్యర్యపరుస్తోంది. ఇది చాలా భిన్నమైనది, అరుదైనది గుర్తించారు శాస్త్రవేత్తలు. గత నెలలో, స్విట్జర్లాండ్‌లోని సర్వియన్ నగరంలో అల్బినో తాబేలు జన్మించింది. తొలిసారిగా జూలో దీని చిత్రాలను విడుదల చేశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ తాబేలు గాలాపాగోస్ జాతికి చెందినది. ఈ జాతికి చెందిన తాబేళ్లు చాలా పెద్దవి. సర్వియన్ నగరంలో అంతరించిపోతున్న జీవజాతులను రక్షించేందుకు కార్యక్రమం నడుస్తోంది. ఈ కార్యక్రమం కింద గత నెలలో రెండు తాబేళ్లు పుట్టాయి. వీటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు తాబేళ్లలో ఒక తాబేళ్ల రంగు నలుపు, మరో తాబేలు రంగు లేత పసుపు. దీనికి ఎర్రటి కళ్ళు ఉన్నాయి. అయితే సెర్వియన్ నగరంలో పుట్టిన తాబేలు మగదా, ఆడదా అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. పుట్టినప్పుడు వాటి బరువు 50 గ్రాములు. ఇవి దాదాపు150 సంవత్సరాల వరకు జీవించగలవని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు తాబేళ్ల తల్లి బరువు 100 కిలోల కంటే ఎక్కువ. ఫిబ్రవరి 11న ఐదు గుడ్లు పెట్టింది. అందులో అరుదైన అల్బినో తాబేలు మే 1న జన్మించగా, రెండో బిడ్డ మే 5న జన్మించింది. ఈ గుడ్లు చెడిపోకుండా ఉండేందుకు సుమారు రెండున్నర నెలల పాటు ఇంక్యుబేటర్ లో ఉంచారు.
ఈ తాబేలు జన్యుపరమైన పరిస్థితి అల్బినిజంను దాటినందున ఇది చాలా అరుదు అని చెబుతున్నారు. అందుకే ఈ తాబేలును అల్బినో అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో శరీరం చర్మం, జుట్టు, కళ్ళకు రంగును అందించడానికి పనిచేసే మెలనిన్ వర్ణద్రవ్యం చాలా తక్కువగా తయారవుతుంది. ఇది కాకుండా అవి చూసే, వినే సామర్థ్యం కూడా కోల్పోతాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



