Platform Tickets : ప్లాట్ ఫాం టికెట్ సేవలను ప్రారంభించిన రైల్వే..! టికెట్ ధరలు పెంచిన స్టేషన్లు..? ఎందుకో తెలుసా..
Platform Tickets : కరోనా వైరస్ కారణంగా పరిమిత రైళ్లను భారత రైల్వే నడుపుతోంది. ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి
Platform Tickets : కరోనా వైరస్ కారణంగా పరిమిత రైళ్లను భారత రైల్వే నడుపుతోంది. ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే కేసులు తగ్గుతుండటంతో రైల్వేలు నెమ్మదిగా స్టేషన్ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో నార్తరన్ రైల్వే ప్లాట్‌ఫాం టిక్కెట్లను విక్రయించాలని నిర్ణయించింది. రైల్వే ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాన్ని ఢిల్లీ డివిజన్‌లోని రైల్వే స్టేషన్‌లో ప్రారంభిస్తారు. తరువాత రైల్వే ప్రయాణికులతో పాటు ఇతర వ్యక్తులు కూడా మునుపటిలా ప్లాట్‌ఫాంకు వెళ్లవచ్చు.
అయితే ప్రేక్షకులను అదుపులో ఉంచడానికి రైల్వే ప్లాట్‌ఫాం టిక్కెట్ల రేటును గణనీయంగా పెంచింది. నార్తరన్ రైల్వే విడుదల చేసిన సమాచారం ప్రకారం..ఇప్పుడు ప్లాట్‌ఫాం టికెట్ కోసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ప్రస్తుతం 889 రైళ్లు నడుస్తున్నాయని రాబోయే 5 నుంచి 6 రోజుల్లో మరో 100 రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ సునిల్ శర్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రయాణికుల అవసరానికి అనుగుణంగా రైలు సర్వీసులను పెంచుతామన్నారు.
సెంట్రల్ రైల్వేలో 197, వెస్ట్రన్ రైల్వేలో 154, నార్తరన్ రైల్వేలో 38 రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణ సమయంలో కరోనా టెస్ట్ రిపోర్ట్ అవసరాన్ని రైల్వేలు త్వరలోనే తొలగించగలవని దీని కోసం కొత్త నిబంధనలను జారీ చేయవచ్చని తెలిపారు. రైలులో ప్రయాణించడానికి చాలా రాష్ట్రాలు కరోనా టెస్ట్ రిపోర్టును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఎవ్వరైనా సరే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణించాలంటే కరోనా పరీక్ష చేయవలసి ఉంటుంది.