Domestic Violence: లాక్ డౌన్ సమయంలో పెరిగిన గృహ హింస.. పూణేలో వేధింపులకు గురవుతున్న భర్తలు!

Domestic Violence: పాపం భర్తలు. ఇన్నాళ్ళూ భార్యలకు దొరక్కుండా చక్కగా ఆఫీసులకు వెళ్ళిపోయేవారు. రాత్రి ఎప్పుడో వచ్చి ఇన్ని మెతుకులు తిని పడుకుని  ఉదయాన్నే మళ్ళీ  ఆఫీసుకు చెక్కేసేవారు.

Domestic Violence: లాక్ డౌన్ సమయంలో పెరిగిన గృహ హింస.. పూణేలో వేధింపులకు గురవుతున్న భర్తలు!
Domestic Violence
Follow us
KVD Varma

|

Updated on: Jun 12, 2021 | 6:26 PM

Domestic Violence: పాపం భర్తలు. ఇన్నాళ్ళూ భార్యలకు దొరక్కుండా చక్కగా ఆఫీసులకు వెళ్ళిపోయేవారు. రాత్రి ఎప్పుడో వచ్చి ఇన్ని మెతుకులు తిని పడుకుని  ఉదయాన్నే మళ్ళీ  ఆఫీసుకు చెక్కేసేవారు. ఇక ఆదివారమో సెలవు రోజో వస్తే ఎదో వంకతో బారులో గడిపెసేవారు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఆ అవకాశం పోయింది. లాక్ డౌన్.. వర్క్ ఫ్రం హోమ్ ఇరవైనాలుగు గంటలూ ఇంటిలోనే ఉండాల్సిన పరిస్థితి. అంతే.. ఇక ఇంట్లో వేధింపుల మోత మోగిపోతోంది. భార్యలు పెట్టె టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు పురుష పుంగవులు. మీరు చదివిన ప్రతి అక్షరం కరెక్టే. గృహ హింస అంటే భర్తలు భార్యలపై చేసే దాష్టీకాలే కాదు.. చాలా సందర్భాల్లో మహిళా మణులు మొగుడికి చూపించే నరకం కూడా. సరిగ్గా ఇదే ఎక్కువైపోయిందట లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్ర లోని పూణే నగరంలో. ఇది మేము చెబుతున్నది కాదు. అక్కడి పోలీసు స్టేషన్ లో నమోదు అయిన కేసుల లెక్కల్లో తేలింది. అలా అని మహిళలపై వేధింపులు జరగడం లేదని కాదు.. వాటి దారి వాటిదే.  వివరాలు ఇలా ఉన్నాయి..

మహారాష్ట్రలోని కరోనా కారణంగా, చాలా మంది ప్రజలు గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటి నుండి పని చేస్తున్నారు. ఈ 24 గంటలు ఇంట్లో ఉండే సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయని వెలుగులోకి వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భర్తలు మరింత వేధింపులకు గురయ్యారు. ఇళ్ళల్లో భర్తలు లాక్డౌన్ కంటే ముందు వారి భార్యలను ఎక్కువగా వేధిస్తున్నారని పూణే పోలీసులకు చెందిన ట్రస్ట్ సెల్ (భరోసా సెల్) కు ఎక్కువ ఫిర్యాదులు వచ్చేవి. అయితే, లాక్డౌన్ సమయంలో ఈ లెక్కలు మారాయని చెప్పారు.

ట్రస్ట్ సెల్ అధినేత సుజాతా షాన్మే మాట్లాడుతూ, లాక్డౌన్ కు ఒక సంవత్సరం ముందు, 1283 మంది కుటుంబ వివాదాలపై పూణే పోలీసుల ట్రస్ట్ సెల్కు ఫిర్యాదు చేశారు. వీరిలో భార్యల సంఖ్య 791 కాగా, భర్తల సంఖ్య 252 మాత్రమే. కానీ లాక్డౌన్ సమయంలో, అంటే, గత 15 నెలల్లో, ఈ సంఖ్య 3,075 కు పెరిగింది. ఇందులో భర్తలపై ఫిర్యాదులు చేసిన మహిళల సంఖ్య 1540 కాగా, పురుషుల సంఖ్య 1535. అంటే, లాక్డౌన్ కు ముందు సంవత్సరంతో పోలిస్తే ఫిర్యాదు చేసే పురుషుల సంఖ్య 6 రెట్లు పెరిగింది. గత ఒకటిన్నర సంవత్సరంలో కుటుంబ వివాదానికి సంబంధించి మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయని సుజాత తెలిపారు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం దాడి, శారీరక మరియు మానసిక వేధింపులు ఉన్నాయన్నారు. కొన్ని ఫిర్యాదులలో వారి భార్యలు తగాదా తర్వాత పిల్లలతో ఇంటికి వెళ్లారని, ఇప్పుడు వారు తిరిగి రావడం లేదని పేర్కొన్నారు.

ప్రజల మానసిక ఒత్తిడి పెరగడం వలనే.. 

సుజాత మాట్లాడుతూ ”24 గంటల పాటూ ఇంట్లోనే ఉండాల్సి రావడంతో మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలపై గొడవ పడుతున్నారు. అలాంటి వారిని స్టేషన్ కు పిలవడం ద్వారా లేదా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారిని ఒప్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము.” అని చెప్పారు. 2019 జనవరి 9 న పూణే పోలీసులకు చెందిన భరోసా సెల్ ఏర్పడింది. పిల్లలు, వృద్ధులు మరియు మహిళలకు సాధ్యమైన ప్రతి విధంగా సహాయం చేయడమే దీని ఉద్దేశ్యం. గృహ హింస, అసమ్మతికి సంబంధించిన కేసులలో సెల్‌కు అనుసంధానించబడిన పోలీసులు మహిళలు లేదా పురుషులకు కూడా సలహా ఇస్తారు.

Also Read: గబ్బిలాలను వదలని చైనా శాస్త్రజ్ఞులు…….24 కొత్త కరోనా వైరస్ లను కనుగొన్నామని వెల్లడి.. ‘వూహాన్ థియరీకి’ చెక్ పెట్టేందుకేనా ..?

Indian Military Academy: పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసి భారత సైన్యంలో భాగం అయిన జెంటిల్మెన్ క్యాడెట్లు