Photo Puzzle: మీకు కనిపించిందా..? డెడ్ ఈజీ అండీ బాబు.. పాము ఎక్కడుందో పసిగట్టారా..?
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కనిపించే వివిధ రకాల పజిల్స్‌ను సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఉన్నాయి. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

హాయ్ ఫ్రెండ్స్.. వచ్చేశాం.. మీకోసం కిక్కిచ్చే పజిల్ తెచ్చాం. ఆప్టికల్ ఇల్యూజన్ లవర్స్ అందర్నీ ఈ పజిల్ అలరిస్తుంది. ఇంటర్నెట్‌లో ఈ మధ్య ఇలాంటి పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అంటే నెటిజన్స్ వాటిని ఎంజాయ్ చేస్తున్నారనే కదా అర్థం. ఇవి కేవలం టైమ్ పాస్ పజిల్స్ కాదండోయ్. మీ కళ్ల ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తేల్చేందుకు ఉపయోగపడతాయి. బుర్రకు కాస్త మేత వేసినట్లు అవుతుంది. ఇలాంటి పజిల్స్ మనల్ని భ్రమలోకి నెడతాయి. మనల్ని చీట్ చేస్తాయి. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా.. కొన్నిసార్లు చిరాకు కూడా తెప్పిస్తాయి. తాజాగా మీ ముందుకు అలాంటి ఓ క్రేజీ విజువల్ ఇల్యూషన్ ఫోటోని తీసుకొచ్చాం. ట్రై చేయండి.
మీరు పైన చూస్తున్న ఫోటోలో చెట్టు కనిపిస్తుంది కదా. అక్కడే ఓ పాము కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అదే టాస్క్. కాస్త పరీక్షగా చూస్తే.. అది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. నిజం చెప్పాలంటే దాన్ని కనిపెట్టడం చాలా ఈజీ. కొంచెం తీక్షణంగా చూస్తే.. పట్టేయవచ్చు. ఈ పజిల్‌ను కూడా కనిపెట్టలేదంటే మీరు ఐ డాక్టర్‌ను కలవాల్సిందే అండీ. సరదాగా అన్నామ్ లేండి. కాగా ఈ పజిల్స్ సాల్వ్ చేస్తే.. మాంచి కిక్ వస్తది. మన బుర్ర బానే పనిచేస్తుంది అనిపిస్తుంది.
ఇంతకీ మీరు ఆ పామును కనిపెట్టారా..?. కనిపెడితే సూపర్ కూల్. కనిపెట్టలేకపోయిన వాళ్లు కూడా కంగారు పడకండి. మేము ఆన్సర్ ఉన్న ఇమేజ్‌ను కింద ఇవ్వబోతున్నాం. అయితే ట్రై చేయకుండా ఆన్సర్ చూస్తే మాత్రం పెద్ద ప్రయోజనం ఉండదు. మన సెల్ఫ్ కాన్సిడెన్స్ కూడా లో అవుతుంది. ప్రయత్నించి.. విఫలమైతే పర్లేదు కానీ.. ప్రయత్నమే లేకపోతే ప్రాబ్లం.. పజిల్ విషయంలోనే కాదు.. లైఫ్‌లో కూడా.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




