AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డుపై 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

మామలుగా పెళ్లి కార్డులో బాగా దగ్గరిగా ఉండే.. బంధుత్వం ఉన్న ఒకటి, రెండు కుటుంబాల పేర్లు వేస్తారు. కానీ ఈ వెడ్డింగ్ కార్డ్‌లో మాత్రం 900 కుటుంబాల పేర్లు వేశారు. అసలు ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Viral: వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డుపై 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Viral Wedding Card
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2022 | 4:35 PM

Share

Tamil Nadu: పెళ్లి..ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్‌ మెమరీ. వెడ్డింగ్‌ కార్డ్‌ మొదలుకొని పెళ్లి మండపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. లేటెస్ట్‌గా తమిళనాడులో తన కుమార్తె పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్‌ చేయించాడు వధువు తండ్రి. ఇప్పుడీ ఇన్విటేషన్‌ కార్డే అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది. జనరల్‌గా శుభలేఖపై ముఖ్యమైన రెండు మూడు కుటుంబాల పేర్లు వేయిస్తుంటారు. కానీ ఇది బాహుబలి వెడ్డింగ్‌ కార్డ్‌. ఒకటి.. రెండు కాదు.. 900కుటుంబాల పేర్లతో శుభలేఖను అచ్చు వేయించారు. 5 గ్రామాలకు చెందిన గ్రామస్తులనే ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా(Thanjavur District) మల్లాపురం(Mallapuram) గ్రామానికి చెందిన రమేష్‌..చుట్టుపక్కల 5 గ్రామాలకు ప్రెసిడెంట్‌. రెండుసార్లు తనను గెలిపించిన గ్రామస్తులనే తన కుటుంబసభ్యులుగా భావించాడు. 900కుటుంబాల పేర్లు కుమార్తె వెడ్డింగ్‌కార్డ్‌పై ముద్రించారు. అంతేకాదు. ఇంటింటికీ వెళ్లి కుమార్తె పెళ్లికి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వాన పత్రికను చూసి స్థానికులే ఆశ్చర్యపోతున్నారు. వెడ్డింగ్‌ కార్డ్‌పై తమ పేర్లు చూసి మురిసిపోతున్నారు. తమ ఇంటి శుభకార్యం అంటూ ప్రెసిడెంట్‌ కుమార్తె పెళ్లి పనులను తమ భుజాన వేసుకొని నడిపిస్తున్నారు. రమేష్‌ కుమార్తె షాలిని వివాహం శుక్రవారం కుంభకోణంలో జరగనుంది. 10వేల మంది బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు.

Video Credits: Jaya Plus

జాతీయ వార్తల కోసం