AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Earthquake: భూకంపంలో అందర్నీ కోల్పోయి ఒంటరైన చిన్నారి.. దత్తత తీసుకునేందుకు వందలాది మంది రెడీ

ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన భయానక దృశ్యాల వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది. తాజాగా ఓ చిన్నారి ఫొటో వైరల్‌గా మారింది. భూకంపంలో చిన్నారి బాలిక కుటుంబ సభ్యులందరూ చనిపోయారని.. ఈ బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు.

Afghanistan Earthquake: భూకంపంలో అందర్నీ కోల్పోయి ఒంటరైన చిన్నారి.. దత్తత తీసుకునేందుకు వందలాది మంది రెడీ
Earthquake In Afghanistan B
Surya Kala
|

Updated on: Jun 24, 2022 | 2:54 PM

Share

Afghanistan Earthquake:  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారం చేపట్టినప్పటి ఆ దేశం.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తరచుగా బాంబ్ పేలుళ్లు వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో ప్రకృతికి కూడా కల్లోలం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున పక్తికా ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం పెను  వినాశనాన్ని సృష్టించింది. ఈ భూకంపం సృష్టించిన బీభత్సంలో వందలాది ఇళ్లు పేకమేడలా కూలిపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో 1000 మందికి పైగా మరణించగా.. 1500 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన భయానక దృశ్యాల వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది. తాజాగా ఓ చిన్నారి ఫొటో వైరల్‌గా మారింది. భూకంపంలో చిన్నారి బాలిక కుటుంబ సభ్యులందరూ చనిపోయారని.. ఈ బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడిందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఏ పిల్లలకు కూడా దేవుడు ఇలాంటి పరిస్థితి కల్పించకూడదని కోరుతున్నారు.

ఆఫ్ఘన్ జర్నలిస్ట్ సయ్యద్ జియర్మల్ హష్మీ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ చిన్నారి ఫోటో హృదయాన్ని కదిలిస్తుంది.  ఫోటో షేర్ చేస్తూ.. శాడు, ‘ఈ అమ్మాయి బహుశా ఆమె కుటుంబంలో జీవించి ఉన్న ఏకైక సభ్యురాలు. బాలిక కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయికి దాదాపు 3 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు తెలుస్తోంది. అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ  వైరల్ ఫోటోలో..  అమ్మాయి ముఖం మీద మట్టితో నిండివుంది.  చిన్నారి వెనుక భూకంపంతో  దెబ్బతిన్న ఇల్లు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది. అయితే ఆ చిన్నారి ప్రశాంతంగా ఆడుకోవడం మీరు చూడవచ్చు. గత రెండు రోజుల క్రితం వరకూ తనకు అందరూ ఉన్నారు..  ఇప్పుడు తనకు ఎవరూ లేరని ఈ అమాయకురాలికి తెలియదు. ట్విటర్‌లో ఈ అమ్మాయి ఫోటోను చూసిన వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భూకంపం తరువాత, అమ్మాయి ఫోటో వైరల్ అయ్యింది

ఈ బాలిక బహుశా ఆమె కుటుంబంలో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు. ఆమె కుటుంబ సభ్యులెవరూ సజీవంగా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఆమె 3 సంవత్సరాల పాప లాగా ఉంది

జర్నలిస్టు సయ్యద్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 74 వేల మందికి పైగా రీట్వీట్ చేయగా, 5 వేల మందికి పైగా దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు.

వినియోగదారులు ఈ బాలికను  దత్తత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను USలో నివసిస్తున్నాను ..  త్వరలో అధికారికంగా చిన్నారిని దత్తత తీసుకోగలను అని కామెంట్ చేస్తున్నారు.

ఆఫ్ఘన్ జర్నలిస్ట్ ప్రజలను అండగా నిలబడాలనుకునే దాతల కోసం గో ఫండ్ మీ లింక్‌ను కూడా షేర్ చేసారు. దీని ద్వారా భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..