Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butcher Son: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లి.. బతికుండగానే బొంద పెట్టాలనుకున్న ఓ కసాయి కొడుకు

మానవత్వం మరిచి నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి బ్రతికి ఉండగానే గొయ్యి తీశాడు ఓ కసాయి కొడుకు.

Butcher Son: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లి.. బతికుండగానే బొంద పెట్టాలనుకున్న ఓ కసాయి కొడుకు
Amma
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 12, 2021 | 9:49 PM

Son digs a Ditch to kill Mother: ‘పిల్లల్ని కంటాం కానీ.. వారి తలరాతలు కనలేంకదా’ ఈ సామెత యాదాద్రి జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటనకు సరిగ్గా సరిపోతుంది. మానవత్వం మరిచి నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి బ్రతికి ఉండగానే గొయ్యి తీశాడు ఓ కసాయి కొడుకు.

యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుచ్చిమల్లయ్య, సాలమ్మ, దంపతులకు ముగ్గురు కుమారులు. నర్సింహ, ఐలయ్య, వెంకటయ్యతోపాటు నలుగురు కూతుళ్లు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం బుచ్చిమల్లయ్య మృతి చెందాడు. ముగ్గురు కుమారులు కలిపి నెలకు రూ.600 చొప్పున ఆరు నెలలకోసారి 3,600 రూపాయలను జీవనభృతి కింద తల్లికి ఇస్తున్నారు. కాగా, అంతా బాగుందనుకుంటున్న తరుణంలో చిన్న కొడుకు రూపంలో అసలు కష్టాలు మొదలయ్యాయి.

చిన్న కుమారుడు వెంకటయ్య నాలుగైదేళ్లుగా తన వాటా డబ్బులు ఇవ్వక పోవడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బతికుండగానే తల్లిని సమాధి చేస్తానంటూ వెంకటయ్య తన భార్యతో కలసి పొలం వద్ద ఉన్న తండ్రి సమాధి పక్కనే బొంద తీశాడు. ఈ విషయం తెలిసిన గ్రామపెద్దలు వెంకటయ్యను తీవ్రంగా మందలించారు. తల్లికి జీవనభృతి ఇవ్వకపోగా, చంపేందుకు ప్రయత్నించడంతో తీవ్రంగా ఆగ్రహించి, తవ్వినం బొందను పూడ్చివేశారు. ప్రతి నెల తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు.

అయినా వెంకటయ్యలో ఎలాంటి మార్పు రాలేదు.. తల్లిని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జీవనభృతి ఇవ్వడంలేదని వెంకటయ్యపై తల్లి గత నెలలో యాదాద్రి కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసింది.

Read Also… AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు!