Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు!

పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది.

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు!
AP HC
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 12, 2021 | 9:50 PM

AP High Court Suspended go no 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇవాళ విచారణ చేపట్టిన అమరావతి హైకోర్టు ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవోను సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ సవాల్ చేసిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించి హైకోర్టు ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లకూడదని అడిగింది. రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్‌ కూడా అలాగేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై విచారణ అనంతరం ఈ జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. దీనిపై గతంలోనూ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోషియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ బుచ్చిరాజు అన్నారు. డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారాలు పంచాయతీ కార్యదర్శులకే ఉండాలన్నారు.

Read Also…  Revanth Reddy: నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజనం యాత్ర షురూ.. చమురు,వంట గ్యాస్ ధరల పెంపు సామాన్యుల నడ్డీ విరుస్తోందిః రేవంత్