YCP vs RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ సస్పెన్షన్‌పై క్లారిటీ ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా.. చర్యలు ఎప్పుడంటే..!
YCP vs RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న..
YCP vs RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ వ్యవహారంలో వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అనర్హత పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు వినాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న తరువాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. కాగా, వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుపై అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ఓం బిర్లా ఈ సమాధానం చెప్పారు.
వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణ రాజు కొద్దిరోజుల్లోనే ఆ పార్టీకి యాంటీగా మారారు. ఏకంగా సొంత పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. వ్యక్తిగతంగానూ దూషణల పర్వం మొదలు పెట్టారు. రఘురామకృష్ణ రాజు చర్యలను తీవ్రంగా పరిగణించిన వైసీపీ అధిష్టానం.. అతని పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వైసీపీ ముఖ్యనేతలు ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లాకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించారు. అయితే, ఎంతకీ స్పీకర్ నుంచి సమాధానం రాకపోవడంతో వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. రఘురామకృష్ణపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్‌లో ఆందోళనలు చేపడతామని విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ హెచ్చరికలు చేశారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా రఘురామకృష్ణరాజుపై చర్యల గురించి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. పార్లమెంట్‌లో తనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలపై ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న నా పై అనర్హత వేటు వేయించాలని పదే పదే ప్రయత్నించే బదులు రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం పోరాడేలా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Also read:
Viral Video: ఇలా కూడా ఔటవుతారా.. చాలా అరుదైన రనౌట్ అంటూ నెటిజన్ల కామెంట్లు!
Viral Pic: కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!
Sulagitti Narasamma: 15,000 మందికి పైగా ఉచిత సుఖప్రసవాలు చేసిన మంత్రసాని.. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం