Banana : అరటి సాగుతో బోలెడు లాభాలు..! ఈ 10 ప్రయోజనాలు కూడా.. తెలుసుకోండి..

Banana : కరోనా యుగంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం అరటి పండు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.

Banana : అరటి సాగుతో బోలెడు లాభాలు..! ఈ 10 ప్రయోజనాలు కూడా.. తెలుసుకోండి..
Banana
Follow us
uppula Raju

|

Updated on: Jul 19, 2021 | 10:06 PM

Banana : కరోనా యుగంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం అరటి పండు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా రైతులకు కూడా లాభాలు తెచ్చిపెట్టే పంటగా మారిపోయింది. అరటి సాగును సరిగ్గా పండిస్తే సులువుగా లక్షలు సంపాదించవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం అరటి సాగు కోసం మంచి నేలను ఎంచుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. ఈ లెక్క ప్రకారం ఒక ఎకరంలో 1250 మొక్కలు పెరుగుతాయి. మొక్కల మధ్య దూరం సరిగ్గా ఉంటే పండ్లు ఏకరీతిన వస్తాయి. ఖర్చు విషయానికొస్తే ఎకరానికి 1 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. అరటి ధరను బట్టి లాభాలు 3 నుంచి 5 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అరటి మొక్కలను నాటడానికి 50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు అయిన గుంతలు తీయాలి. వీటిని 15 రోజులు ఎండలో ఉంచాలి. తరువాత 10 కిలోల ఆవు పేడ, 250 గ్రాముల వేప, 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుంతలలో వేయాలి. తరువాత అరటి మొక్కలను నాటాలి. వేళ్లు లోతుగా వెళ్లవు కనుక నీటి లభ్యత విషయంలో జాగ్రత్త వహించాలి.

అరటి వల్ల కలిగే లాభాలు..

1. అరటిలో ఫైబర్, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పొటాషియం -9%, విటమిన్ బి 6-33%, విటమిన్ సి -11%, మెగ్నీషియం- 8%, రాగి- 10%, మాంగనీస్ -14%, నెట్ కార్బ్స్- 24 గ్రా, ఫైబర్- 3.1 గ్రా, ప్రోటీన్- 1.3 గ్రా, కొవ్వు- 0.4 గ్రాములు ఉంటాయి.

2. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మీడియం అరటిపండులో 105 కేలరీలు ఉంటాయి.

3. ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.

4. కేలరీలు తక్కువగా పోషకాలు, ఫైబర్ అధికంగా ఉన్నందున బరువు తగ్గడానికి సహాయపడవచ్చు.

5. పొటాషియం, మెగ్నీషియానికి మంచి వనరు. గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.

6. అరటిపండ్లలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

7. పండిన అరటిపండ్లలో అధిక మొత్తంలో రెసిస్టెంట్ స్టార్చ్ లేదా పెక్టిన్ ఉన్నప్పుడు ఆకలిని తగ్గిస్తాయి.

8. అరటిపండ్లు రెసిస్టెంట్ స్టార్చ్ మంచి మూలం. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

9. వ్యాయామం వల్ల కలిగే కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

10. అద్భుతమైన అల్పాహారం, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Smart Saving Tips : డబ్బులు పొదుపు చేయడానికి 5 సులువైన మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

Toli Ekadasi 2021: హిందువుల మొదటి పండగ.. తొలి ఏకాదశి.. ఈ రోజున పాటించాల్సిన పూజ నియమాలను తెలుసుకుందాం

Amaravati lands: అమరావతి భూముల్లో నో ఇన్ సైడర్.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు