Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Saving Tips : డబ్బులు పొదుపు చేయడానికి 5 సులువైన మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..

Smart Saving Tips : మానవ జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే డబ్బును ఇష్టపడని వ్యక్తులుండరు.

Smart Saving Tips : డబ్బులు పొదుపు చేయడానికి 5 సులువైన మార్గాలు..! ఏంటో తెలుసుకోండి..
Rupee
Follow us
uppula Raju

|

Updated on: Jul 19, 2021 | 9:35 PM

Smart Saving Tips : మానవ జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో అందరికి తెలుసు. ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే డబ్బును ఇష్టపడని వ్యక్తులుండరు. అయితే చాలామంది మనీ పొదుపు చేయకుండా దుబారాగా ఖర్చు చేస్తుంటారు. ఇది మంచి పద్దతి కాదు. ప్రపంచ ధనవంతులైన వారెన్ బఫెట్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో వరకు అందరు డబ్బును పొదుపు చేయాలని సలహా ఇస్తారు. కొంతమంది క్షణాల్లో లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు కానీ సంపాదించారు. కానీ జీవితంలో ఉన్నతంగా బతకాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖర్చు చేయడం తేలిక సంపాదించడం చాలా కష్టం. ఈ సత్యం తెలిసిన వారు మంచి స్థితిలో ఉంటారు. అయితే పొదుపు ఎలా చేయాలనేది కొంతమందికి తెలియదు. స్మార్ట్ సేవింగ్స్ కోసం ఈ పద్దతులను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1 కిరాణ షాపింగ్ తెలివిగా చేయాలి.. మీరు కిరాణ షాపునకు వెళితే సరుకులు తెలివిగా కొనాలి. కారణం లేకుండా ఏ వస్తువులను కొనరాదు. అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. వారం లేదా నెల ఖర్చులను ప్లాన్ చేస తదనుగుణంగా సరుకులు కొనడం అలవాటుచేసుకోవాలి. ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది. అనవసర కొనుగోళ్లు ఉండవు. తద్వారా ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది.

2. బయట తినడం మానుకోవాలి.. కరోనా యుగంలో పొదుపు చాలా ముఖ్యం. అసలే దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరోవైపు కరోనా భయం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే రెస్టారెంట్‌లో తినడం మంచిదే. కానీ కొన్నిసార్లు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందుకే రెస్టారెంట్‌లో తినడం కన్నా ఇంట్లో చేసుకొని తినడం ఉత్తమం. ఆరోగ్యానికి ఆరోగ్యం పొదుపుకు పొదుపు ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి.

3 సమయానికి రుణాలు, బిల్లులు చెల్లించండి సమయానికి రుణాలు, బిల్లులు చెల్లించడం మంచి పరిణామం. అయితే రుణాలు తీసుకోవడం మంచి పద్దతి కాదు. ఇది మీపై ఒత్తిడి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు సమయానికి చెల్లించకపోతే వడ్డీ మీద వడ్డీ పెరిగి అధికంగా చెల్లించవలసి వస్తుంది. అప్పుడు స్థిరాస్తులను అమ్ముకునే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు, విద్యుత్, నీటి బిల్లులను సకాలంలో చెల్లించడం మంచిది.

4. గృహ రుణం తీసుకుంటే ఏమి చేయాలి గృహ రుణం తీసుకుంటే EMI ని సకాలంలో చెల్లించాలి. అనవసర ఖర్చులకు డబ్బు ఖర్చు చేయవద్దు. దీని పర్యవసానాలు ఊహించని విధంగా ఉంటాయి. 10 సంవత్సరాలలో 20 సంవత్సరాల రుణాన్ని ఎలా చెల్లించాలి. ఇలా ఆలోచన చేస్తే మీ గృహ రుణంలో సగం డబ్బులు సులభంగా ఆదా అవుతాయి. మీకు పొదుపు పెరుగుతుంది.

5 టీవీ ప్యాక్‌ల ధరను తగ్గించండి ప్రస్తుత కాలంలో టీవీ రిఛార్జ్‌లకు బోలెడు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇది మనకు అవసరమా అని ఒక్కసారి ఆలోచించుకోండి. కొంతమంది రోజు మొత్తంలో ఆఫీసులోనే గడుపుతారు. దొరికిన ఒక్కరోజు సెలవు గురించి టీవీ రిఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇది దుబారా ఖర్చు. అంతేకాదు ఒకవేళ ఫ్యామిలీ ఉన్నా వేల ఛానళ్లకు డబ్బులు పే చేస్తూ ఉంటారు. నిత్యం చూసే ఛానెళ్లకు డబ్బులు కడితే సరిపోతుంది. దీంతో ఎంతో కొంత మనీ ఆదా అవుతుంది. చిన్న చిన్న పొదుపులే రేపు పెద్దమొత్తం అవుతుందని గుర్తుంచుకోండి.

Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..

Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..

Monsoon: వర్షాకాలం..చిటపట చినుకులు..ఆరుబయట..ఆ ముచ్చట ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందట..ఈ వీడియో చూస్తే మీరు ఫిదా అయిపోతారు!