Monsoon: వర్షాకాలం..చిటపట చినుకులు..ఆరుబయట..ఆ ముచ్చట ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందట..ఈ వీడియో చూస్తే మీరు ఫిదా అయిపోతారు!

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: KVD Varma

Updated on: Jul 19, 2021 | 8:17 PM

Monsoon: వర్షాకాలం వస్తే భలే ఉంటుంది. ఒకపక్క చిటపట చినుకులు పడుతుంటే.. మరో పక్క వేడి వేడి బజ్జీలు తింటూ ఇష్టమైన సంగీతం వింటూ ఆ వాన చినుకుల టపటపలను ఆస్వాదించడం చక్కని అనుభూతి.

Monsoon: వర్షాకాలం..చిటపట చినుకులు..ఆరుబయట..ఆ ముచ్చట ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందట..ఈ వీడియో చూస్తే మీరు ఫిదా అయిపోతారు!
Monsoon

Follow us on

Monsoon: వర్షాకాలం వస్తే భలే ఉంటుంది. ఒకపక్క చిటపట చినుకులు పడుతుంటే.. మరో పక్క వేడి వేడి బజ్జీలు తింటూ ఇష్టమైన సంగీతం వింటూ ఆ వాన చినుకుల టపటపలను ఆస్వాదించడం చక్కని అనుభూతి. పిల్లలకు వానలో తడుస్తూ ఆడుకోవడం.. పెద్దలకు వర్షాకాలం సాయంత్రం వేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం..యువజనానికి వాన చినుకుల్లో రోమాన్స్ చేయడం ఇలా వర్షంలో ఏ వయసు వారు ఆ వయసు ముచ్చట్లు తీర్చుకోవాలని సరదా పడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. వర్షాకాలం వస్తే ఎంత మనోరంజకంగా గడపొచ్చు అనే విషయాన్ని ఒక్క ట్వీట్ ద్వారా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సింపుల్‌గా హృదయానికి హత్తుకునేలా చెప్పేశారు. వర్షాకాలం మూడ్ ని ట్విట్టర్ వేదికగా అందరికీ ఆహ్లాదకరంగా పంచేశారు. ఇప్పుడు ఈ వీడియో ట్వీట్ వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే..

ఒక చిన్న దుకాణం.. దానిముందు కూచున్న పెద్దవయసు జంట.. ఆ పక్కనే ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు.. పచ్చని వాతావరణం.. సన్నని వాన.. బ్యాక్ గ్రౌండ్‌లో లతా మంగేష్కర్..ముఖేష్ కుమార్ మధురగానంలో ‘మౌసం క్యా బహర్ హై’ అంటూ వినిపించే పాట.. అంతే. ఈ వీడియో ఒరిజినల్ జిఫ్ కథలు చెప్పే బోహ్రా సిస్టర్స్‌ది. దీనికి ట్వీట్‌లో హర్షా గోయెంకా తనడైన టచ్ ఇచ్చారు. ఆ పెద్ద వారి చేతుల్లో టీ పెట్టారు.. పిల్లల చేతికి వేడి పకోడీ ఇచ్చారు. ఇంకేముంది.. వానాకాలం సాయంత్రం చిటపట చినుకుల సందడిలో మన మనసులు చేసే సరదాల సవ్వడి సోషల్ మీడియాలో ఆవిష్కృతం అయిపోయింది.

మీరూ ఇక్కడ ఆ ట్వీట్‌లోని వీడియో చూడండి..

చూశారుగా.. మీరు కూడా ఒక్కసారిగా ఆ చినుకుల చిత్రంలో మానసిక సంతోషంలో తడిసిపోయారు కదా. ట్విట్టర్‌లో కూడా అందరూ అలాగే అద్భుతమైన అనుభూతి పొందారు. ‘మాన్‌సూన్ మూడ్’ అంటూ గోయెంకా ఇచ్చిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇకేముంది.. ఈ ట్వీట్ కు అద్భుతమైన కామెంట్స్ వెల్లువెత్తాయి..

కొన్ని కామెంట్స్ ఇక్కడ చూడండి..

Also Read: VIRAL VIDEO : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన కారు దొంగ..! రైలు పట్టాలపై కారు నడుపుతూ గందరగోళం..

Python Video: జగిత్యాల జిల్లాలో భారీ పాముని మింగిన కొండ చిలువ.. షాకింగ్ విజువల్స్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu