Train Ticket: ట్రైన్ టికెట్ పోయిందా..? ఏం పర్వాలేదు.. నిముషాల్లో డూప్లికేట్ టికెట్ తీసుకోండిలా..

ఇప్పటికీ రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్‌లో రైలు టికెట్లు తీసుకుంటున్నవాళ్లు లేకపోలేదు. మరి అలా తీసుకున్న రైలు టికెట్ పోతే ఏం చేయాలి..? జర్నీ..

Train Ticket: ట్రైన్ టికెట్ పోయిందా..? ఏం పర్వాలేదు.. నిముషాల్లో డూప్లికేట్ టికెట్ తీసుకోండిలా..
Train Ticket
Follow us

|

Updated on: Feb 04, 2023 | 9:01 AM

టెక్నాలజీ పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌లో ముందుగానే ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో ఈజీగా రైలు టికెట్లు బుక్ చేస్తున్నారు. అయినా ఇప్పటికీ రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్‌లో రైలు టికెట్లు తీసుకుంటున్నవాళ్లు లేకపోలేదు. మరి అలా తీసుకున్న రైలు టికెట్ పోతే ఏం చేయాలి..? జర్నీలో భారీగా ఫైన్ కట్టాల్సిందేనా..? ప్రత్యమ్నాయంగా డూప్లికేట్ ట్రైన్ టికెట్ తీసుకోవచ్చా..? ఇలా రైల్వే ప్రయాణికులకు అనేక సందేహాలు ఉంటాయి. రైలు ప్రయాణ సమయంలో జర్నీ పూర్తి చేసుకొని, మీరు దిగాల్సిన స్టేషన్‌లో రైలు దిగి, బయటకు వెళ్లేంత వరకు మీ రైలు టిక్కెట్ మీ దగ్గరే ఉండటం చాలా అవసరం. టికెట్ పోగొట్టుకున్నా లేదా సీటు బుక్ చేసుకోకుండా ప్రయాణించినా భారీ జరిమానాను చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. మరి దీనిపై భారతీయ రైల్వే నియమనిబంధనలు (Indian Railways Rules) ఏం చెబుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే నియమ నిబంధనల గురించి తెలియకపోవడం వల్ల రైల్వే ప్రయాణికులు, తమ రైలు టికెట్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక కంగారుపడుతుంటారు. మీరు ట్రైన్ టికెట్ పోగొట్టుకున్నట్లయితే మీ పేరుతో టికెట్ కౌంటర్‌లో లేదా టీటీఈ సాయంతో డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు. ఇందుకోసం కాస్త ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ పోయినట్టు గుర్తించిన ప్రయాణికులు నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లి లేదా టీటీఈని కలిసి డూప్లికేట్ టికెట్ కావాలని కోరాలి. డూప్లికేట్ ట్రైన్ టికెట్ ఎలా పొందాలో భారతీయ రైల్వే తమ అధికారిక వెబ్‌సైట్‌లో వివరించింది. స్లీపర్ లేదా సెకండ్ స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.50 ఛార్జీ చెల్లించాలి. ఏసీ కోచ్ టికెట్ అయితే రూ.100 ఫీజు చెల్లించాలి. ఒకవేళ రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత డూప్లికేట్ టికెట్ కావాలంటే మొత్తం ఛార్జీలో 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ చిరిగిపోతే ఛార్జీలో 25 శాతం చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవచ్చు.  అయితే ఒక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు డూప్లికేట్ టికెట్ జారీ చేయరు. రైల్వే ప్రయాణికులకు ఇక్కడ మరో వెసులుబాటు ఉంది. మీరు డూప్లికేట్ టికెట్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఒరిజినల్ టికెట్ దొరికితే ఏం చేయాలి..? అని డౌట్ రావచ్చు కదా.. డూప్లికేట్ టికెట్ కౌంటర్‌లో డిపాజిట్ చేసి రీఫండ్ తీసుకోవచ్చు. ఇలా భారతీయ రైల్వేకి సంబంధించి అనేక నియమనిబంధనలు ఉన్నాయి. తరచూ రైల్వే ప్రయాణం చేసేవారు ఇలాంటి రూల్స్ తెలుసుకుంటే జర్నీలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా