AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మామూలు రిటైర్‌మెంట్ ఫంక్షన్ కాదు.. అన్నదాతలకు అరుదైన గౌరవం..!

సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్థుల పదవీ విరమణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ వృద్ధాప్యంలో రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉద్యోగస్థులు భావిస్తారు.

ఇది మామూలు రిటైర్‌మెంట్ ఫంక్షన్ కాదు.. అన్నదాతలకు అరుదైన గౌరవం..!
Farmers Retirement Function
B Ravi Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 11, 2024 | 3:24 PM

Share

సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్థుల పదవీ విరమణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారులు ఘనంగా నిర్వహించడం పరిపాటి. ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ వృద్ధాప్యంలో రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉద్యోగస్థులు భావిస్తారు. అయితే అలాంటి రిటైర్‌మెంట్ కార్యక్రమమే తిపి గుర్తుగా ఉండిపోయేలా ఏలూరు జిల్లాలో జరిగింది. కానీ వారు ఇటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్థులు మాత్రం కాదు. ఇంతకీ ఆ రిటైర్‌మెంట్ ఫంక్షన్ ఎవరికి చేశారు. ఎందుకు చేశారు. అంత ప్రత్యేకంగా రిటైర్‌మెంట్ ఫంక్షన్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేగా మీ డౌట్.. ఇప్పుడు ఈ స్టోరీలో ఆ వివరాలు తెలుసుకుందాం..

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఇప్పటివరకు ఎక్కడ వినని, జరగని రిటైర్‌మెంట్ ఫంక్షన్ రైతులకు నిర్వహించారు. కాస్త ఈ కార్యక్రమం గురించి వినటానికి ఆశ్చర్యంగానే ఉన్న దాని ఉద్దేశం వెనక ఆంతర్యం తెలిసిన పలువురు వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. గవరవరం గ్రామానికి చెందిన కొంతమంది సీనియర్ రైతులకు సామూహిక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా తమ అనుభవంతో కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రకృతితో మమేకమై ఆరుగాలం కష్టించి పంటలు పండించి అందరికీ అన్నదాతలుగా నిలిచిన రైతులకు రిటైర్‌మెంట్ ఫంక్షన్ చేయాలని స్థానికులు ఆలోచన చేశారు. అందుకోసం గ్రామంలో 70 సంవత్సరాలు పైబడి 90 సంవత్సరాలు లోపు ఉన్న వృద్ధులకు రిటైర్‌మెంట్ ఫంక్షన్‌లో భాగంగా వారిని ఘనంగా సత్కరించాలనుకున్నారు.

ఈ క్రమంలో వారందరినీ ఒకే వేదిక వద్దకు చేర్చి మండల వ్యవసాయ అధికారులు సమక్షంలో వారికి ఘనంగా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారిని గౌరవంగా శాలువాలు కప్పి, పూల దండలు వేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారి అనుభవాలు రాబోయే తరాలకు మార్గదర్శకాలు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసిన వారిని సైతం పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..