Vastu Tips: అద్దె అయినా సొంతిళ్లయినా… ఈ బేసిక్‌ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..

అయితే మనలో చాలా మంది వాస్తు అనేది కేవలం సొంతింటికి మాత్రమే వర్తిస్తుందని, అద్దె ఇంటి విషయంలో వాస్తు పాటించాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటారు. అయితే వాస్తు నిపుణులు అభిప్రాయం ప్రకారం వాస్తు అనేది అద్దె ఇంటికి కూడా కచ్చితంగా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా కొన్ని బేసిక్‌ వాస్తు సూచనలు పాటించాలని చెబుతున్నారు...

Vastu Tips: అద్దె అయినా సొంతిళ్లయినా... ఈ బేసిక్‌ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..
Vastu Tips
Follow us

|

Updated on: Jul 11, 2024 | 3:37 PM

వాస్తును తప్పకుండా పాటించే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయలను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి. అందుకే ఇంటి నిర్మాణం కోసం పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే రంగు వరకు ప్రతీ విషయంలో వాస్తు ఉండేలా చర్యలు తీసుకుంటారు. వాస్తు పండితుల సూచనలను తుచా తప్పకుండా పాటిస్తుంటారు.

అయితే మనలో చాలా మంది వాస్తు అనేది కేవలం సొంతింటికి మాత్రమే వర్తిస్తుందని, అద్దె ఇంటి విషయంలో వాస్తు పాటించాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటారు. అయితే వాస్తు నిపుణులు అభిప్రాయం ప్రకారం వాస్తు అనేది అద్దె ఇంటికి కూడా కచ్చితంగా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా కొన్ని బేసిక్‌ వాస్తు సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి మెయిన్‌ డోర్‌ ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు మెదలుకాకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఓవైపు మెట్లు ఉంటే పర్లేదు కానీ మెయిన్‌ డోర్‌లో మాత్రం మెట్లు మొదలుకాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం పడుతుంది.

* ఇక ఈశాన్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మెంట్లు ఉండకూడదు. అదే విధంగా ఈశాన్యంలో వాష్‌ రూమ్స్‌ కూడా ఉండొద్దు. దీనివల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన చిక్కుఆఉల ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

* ఇక ఇటీవల డోర్లకు ఒకే తలుపు ఏర్పాటు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయతే ఇలాంటి సింగిల్ డోర్‌లను ఓపెన్ చేసే సమయంలో డోర్‌ కచ్చితంగా కుడివైపు తెరుచుకునేలా మాత్రమే ఉండాలి.

* ఇంట్లో గెస్ట్ రూమ్‌ను వాయువ్యం మూలన ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి.

* ఇక అద్దె ఇల్లు అయినా, సొంతిళ్లు అయినా ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్‌ లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఆగ్నేయంలో ఉండే బెడ్ రూమ్‌లో నిద్రించే జంటల మధ్య శత్రుత్వం నెలకొంటుంది. సక్యత కోల్పోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఇంట్లో రెండు ద్వారా ఎదురెదురుగా ఉండే కచ్చితంగ అవి రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే డోర్లు సరి సంఖ్యలో ఉండాలని చెబుతున్నారు.

* ఇక ఇంటికి ఉత్తరం తూర్పులో కచ్చితంగా ఎంతో కొంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు దిశలు పూర్తిగా మూతపడడం వాస్తు ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు.

* ఇంట్లో ఏర్పాటు చేసుకునే కిటికీలు కచ్చితంగా బయటకు తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..