Food: కొన్ని ఆహారాలను చూసి టెంప్ట్‌ అవుతున్నారా.? అంతే సంగతులు.!

Food: కొన్ని ఆహారాలను చూసి టెంప్ట్‌ అవుతున్నారా.? అంతే సంగతులు.!

Anil kumar poka

|

Updated on: Jul 11, 2024 | 3:13 PM

నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తుంది. అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యాన్డ్ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది.

నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తుంది. అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యాన్డ్ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇటువంటి ఆహారాలలో బిస్ ఫినాల్-ఎ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారాలను అధిక రోజులు నిల్వ ఉంచడానికి వినియోగిస్తారట. కార్బోనేటేడ్ పానీయాలు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంటే కోల్డ్‌ డ్రింక్‌లు, పండ్ల రసాలు లాంటి పానీయాలు అస్సలు ఆరోగ్యకరమైనవి కావు అంటున్నారు నిపుణులు. మైక్రోవేవ్ పాప్‌కార్న్‌ను క్యాన్సర్ కారకంగా కూడా పరిగణిస్తారు. ఇది హానికరమైన PFOA అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన చక్కెర కూడా చాలా హానికరం. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇందులో కలిపిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి హానికరం. అలాగే సోడియం అధికంగా ఉండే ఆమ్ల ఆహారాలు కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయి. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ వీటి వల్లే వస్తుందంటున్నారు. అందుకే నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 11, 2024 03:09 PM