Elections: ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో వారే కీలకం.. ఓటు వేసే ముందు ఈ విషయాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..?
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించి ప్రజలు తమకు నచ్చిన నేతను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయడం పరిపాలనలో ముఖ్య బాధ్యత.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించి ప్రజలు తమకు నచ్చిన నేతను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయడం పరిపాలనలో ముఖ్య బాధ్యత. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పకడ్బందీగా నిర్వహించేలా అవసరమైన అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నియామకం కొన్ని నెలలఉందే సన్నద్ధం చేస్తుంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్ధుల నామినేషన్లు, ప్రచారాలు, పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని ఘట్టాల్లో అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది.
బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా చేస్తేనే ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా జరుగుతుంది. ఇక జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలో ఎన్నికల ప్రక్రియ వారే పూర్తి బాధ్యత వహిస్తారు. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు, శిక్షణ కార్యక్రమాలు అన్ని జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టరే పర్యవేక్షిస్తారు.
ఎన్నిక ప్రక్రియలో అధికారుల విధులు, బాధ్యతలు..
- బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ): ఎన్నికల ప్రక్రియలో చిట్టచివరి సిబ్బందే బూత్ స్థాయి అధికారి. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు దరఖాస్తులు వీరే పర్యవేక్షిస్తారు. అర్హులైన పౌరుల పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా విధులు నిర్వర్తిస్తారు. ఓటరు నమోదు, జాబితా తయారీలో పై అధికారులకు తోడ్పాటు అందిస్తారు.
- ప్రిసైడింగ్ అధికారి: ఈ స్థాయి అధికారి పేరు ముఖ్యంగా పోలింగ్ సమయంలో వినిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి అవసరమైన ఈవీఎంలు, ఇతర సామగ్రి సమకూర్చడం ప్రిసైడింగ్ అధికారి బాధ్యత. పోలింగ్ ముగిసిన తర్వాత సిబ్బందితో కలిసి ఈవీఎంలను భద్రపరుస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి నియామకం జరుగుతుంది.
- సెక్టోరియల్ అధికారి: పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత సెక్టోరియల్ అధికారి పైనే ఉంటుంది. ఆరు పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టోరియల్ అధికారిని నియమిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ర్యాంపులు, ఇతర వసతుల కల్పించడం వీరి విధుల్లో భాగం.
- రిటర్నింగ్ అధికారి: ఎన్నికల ప్రక్రియలో తరచూ వినపడే ముఖ్యమైన అధికారే రిటర్నింగ్ అధికారి. ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్ అధికారిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఆమోదం అంతా కూడా ఈ అధికారి బాధ్యత. అభ్యర్థుల తుదిజాబితా వెల్లడి, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు రిటర్నింగ్ అధికారిది కీలక పాత్ర ఉంటుంది. సహాయ రిటర్నింగ్ అధికారి సహకారంతో నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియకు వీరే పూర్తి బాధ్యత వహిస్తారు.
వీరే కాకుండా.. పలువురు అధికారులు కూడా ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటారు..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..