AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఎడారి మొక్కలు పెంచుకుంటున్నారా ?.. వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

ఇళ్లల్లో పూల మొక్కలు,పండ్ల మొక్కలు పెంచుకొవడం సాధారణమే. కానీ ఇప్పుడు కొత్తగా వాటి ప్లేస్ లో ఎడారి మొక్కలు వచ్చి చేరాయి. ఎడారి మొక్కలు ఇక్కడ ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఎలా మొలుస్తాయి అనే డౌట్ వస్తుంది కదా..ఆయితే ఈ స్టోరీ చదవాల్సిందే. సాధారణంగా మనం చాలా మంది ఇళ్లల్లో.. ఇంటి పైన మిద్దె తోటల్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచడం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వాటి ప్లేస్ లో కొత్తగా ఎడారి మొక్కలు వచ్చి చేరాయి. వీటిని చాలా మంది ఇప్పుడు ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారు.

ఇంట్లో ఎడారి మొక్కలు పెంచుకుంటున్నారా ?.. వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే
Desert Plants
P Shivteja
| Edited By: |

Updated on: Aug 14, 2023 | 5:38 AM

Share

ఇళ్లల్లో పూల మొక్కలు,పండ్ల మొక్కలు పెంచుకొవడం సాధారణమే. కానీ ఇప్పుడు కొత్తగా వాటి ప్లేస్ లో ఎడారి మొక్కలు వచ్చి చేరాయి. ఎడారి మొక్కలు ఇక్కడ ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఎలా మొలుస్తాయి అనే డౌట్ వస్తుంది కదా..ఆయితే ఈ స్టోరీ చదవాల్సిందే. సాధారణంగా మనం చాలా మంది ఇళ్లల్లో.. ఇంటి పైన మిద్దె తోటల్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలను పెంచడం చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు వాటి ప్లేస్ లో కొత్తగా ఎడారి మొక్కలు వచ్చి చేరాయి. వీటిని చాలా మంది ఇప్పుడు ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారు. వీటికీ ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. సంగారెడ్డిలో ఎక్కువ మంది వీటిని ఇండ్లలో పెంచుకుంటున్నారు. ఎడారి మొక్కల పెంపకంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న పలువురు.. వీటిని ఇంట్లో అలంకరణకి ప్రస్తుతం ఎడారి చెట్ల మొక్కలని వాడుతున్నారు.

ఎడారిలో దొరికే మొక్కలకు మన దగ్గర దొరికే మొక్కల్లో తేడా ఏంటి అంటే.. మన దగ్గర ఉండే మొక్కలకి ఒక్కరోజు నీరు పోయకపోతే అవి వాడిపోతాయి. అలాగే ఒక వారం పాటు నీరు పోయకపోతే ఆ మొక్క చనిపోతుంది. కానీ ఈ ఎడారి మొక్కలు అలా కావు. నెలల తరబడి నీరు పోయకపోయినా అవి అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ ఎడారి మొక్కలకు బాగా డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో వీటి ధర కూడా బాగానే పలుకుతుంది. ఇంటి పెరట్లో, ఇంటి ముందు, హాల్లో ఇలా నలుగురికి కనిపించే విధంగా ఈ మొక్కలను పెంచడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఎడారి మొక్కల్లో షూ లెన్స్, ఫక్తస్ లాంటి మొక్కలు ఇంట్లో పెంచు కోవడానికి అనుకూలంగా ఉంటాయి. వీటి వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వేడిని గ్రహించి, చల్లదనాన్ని అందిస్తాయి. ఇంటి అలంకరణలో సాంప్రదాయ మొక్కలకు ఇవి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇందులో మనకు కావాల్సిన చిన్న సైజు నుంచి, పెద్ద సైజుల వరకు అన్ని రకాల మొక్కలు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి నీటిని పోయకపోయినా నెలలు తరబడి గాలిలో ఉన్నటువంటి తేమను గ్రహించి బ్రతుకుతాయి. మామూలు మొక్కలు ఎండలకి వాడిపోయిన ఈ మొక్కలు మాత్రం ఎప్పుడు పచ్చదనంగా ఉంటూ ఇంటికి కొత్త శోభని తీసుకొస్తాయి. వింత,వింత రూపాలలో వినూత్న ఆకారాలలో చూడగానే మై మరిచిపోయే రకంగా ఉంటూ, ఇంట్లోకి వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మామూలు మొక్కల కన్నా ఈ ఎడారి మొక్కలపైనే ప్రస్తుతం జనాలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. వివిధ రకాల పింగాణి పాత్రలలో.. చిన్న, పెద్ద సైజులలో కావలసిన రకంగా ఇవి దొరుకుతుండడంతో ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులంతా ఈ ఎడారి మొక్కలపైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. సంగారెడ్డిలో చాలా మంది ఈ మొక్కలను వారి వారి ఇండ్లలో పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 200 నుండి 300 మొక్కలను పెంచుకుంటున్నారు..ఏది ఏమైనా ఎడారిలో ఉండే మొక్కలు ఇక్కడికి రావడం.. వాటిని చూసిన జనం కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

Follow Us