Rahu Transit 2023: ఆ రాశివారికి కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు.. మీనంలో రాహు సంచారం ఎవరెవరికి నష్టం కలుగుతుందంటే..?.
Rahu Transit 2023: ఛాయం గ్రహం లేదా దుష్ట గ్రహంగా పేరొందిన రాహువు ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల ఎవరికీ హాని లేదు, కానీ అక్టోబర్ 30 రాహువును మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి ఎవరి జాతక చక్రంలో అయితే రాహువు నీచ స్థితిలో ఉంటుందో, ఆ రాశుల వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ రాహువును నీచ స్థితిలో కలిగి ఉండి కష్టాలపాలయ్యే రాశులేమిటే ఇప్పుడు చూద్దాం..
Rahu transit 2023: సనాతన హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కారణంగానే ప్రతి శుభకార్యానికి ముందు గ్రహాల అనుకూలత, మూహుర్తం వంటివి పరిగణనలోకి తీసుకుని ప్రారంభిస్తారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు అంటే వాటి గ్రహ సంచరాలు, నక్షత్ర సంచరాలు కూడా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కలిగే మార్పులు కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఛాయం గ్రహం లేదా దుష్ట గ్రహంగా పేరొందిన రాహువు ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల ఎవరికీ హాని లేదు, కానీ అక్టోబర్ 30 రాహువును మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయానికి ఎవరి జాతక చక్రంలో అయితే రాహువు నీచ స్థితిలో ఉంటుందో, ఆ రాశుల వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ రాహువును నీచ స్థితిలో కలిగి ఉండి కష్టాలపాలయ్యే రాశులేమిటే ఇప్పుడు చూద్దాం..
వృషభ రాశి: మీన రాశిలో రాహు గ్రహ సంచారం వృషభ రాశివారికి ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఫలితంగా వ్యాపారులు, రైతులు భారీగా నష్టపోతారు. ఉద్యోగులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో బాధపడతారు. విద్యార్థులు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో తడబడి సమస్యలను కొనితెచ్చుకుంటారు. కుటుంబంలో విభేదాలు కలిగే ప్రమాదం ఉంది.
మేష రాశి: మీన రాశిలో రాహు సంచారం మేష రాశివారికి కూడా చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశివారు జాగ్రత్తలు వహించాలి. కెరీర్‌లో అడ్డంకులు వచ్చి, అర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. తల పెట్టిన ప్రతి పనిలో మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఫ్రెండ్స్‌తో మనస్పర్థలు ఏర్పడతాయి.
మకర రాశి: రాహువు మీన రాశిలో సంచరించడం మకర రాశి వారికి కష్టాలను తెచ్చేదిగా ఉంటుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి. అలాగే చేసిన కష్టానికి ఫలితం, గుర్తింపు లభించదు. మానసికంగా క్రుంగిపోతారు. ఆఫీసులో ప్రశాంతత ఉండదు, అర్థిక పరిస్థితి దిగజారి అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారులు పెట్టే పెట్టుబడులకు నష్టం కలుగుతుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి