Gas Stove: మీ గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తోందా.? ఇంట్లోనే ఖర్చు లేకుండా ప్రాబ్లమ్ ఇలా సాల్వ్..
మీ గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తోందా? రిపేర్ షాప్‌కి తీసుకెళ్లే ముందు ఈ చిన్న ట్రిక్ ప్రయత్నించండి. కేవలం ఒక పిన్నుతో ఐదు సెకన్లలో గ్యాస్ స్టవ్‌ను ఎలా క్లీన్ చేసుకోవచ్చో.. మంటను ఎలా పెంచుకోవచ్చో మీకు తెలుస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది నిత్యం వాడే వస్తువు. అయితే కొన్ని రోజుల తర్వాత గ్యాస్ స్టవ్ మంట క్రమంగా తగ్గిపోవడం మనం గమనిస్తుంటాం. దీనివల్ల వంట ఆలస్యం అవ్వడమే కాకుండా గ్యాస్ కూడా వృథా అవుతుంది. చాలామంది దీనికోసం మెకానిక్‌ను పిలిపిస్తుంటారు లేదా బయట రిపేర్ చేయిస్తుంటారు. కానీ, కేవలం ఒక చిన్న పిన్ను సహాయంతో ఇంట్లోనే అతి సులభంగా ఈ సమస్యను ఐదు సెకన్లలో పరిష్కరించుకోవచ్చు. సాధారణంగా గ్యాస్ స్టవ్ మంట తగ్గడానికి ప్రధాన కారణం ‘నిప్పు గొట్టం’ (Nipple/Nozzle)లో దుమ్ము లేదా నూనె జిడ్డు పేరుకుపోవడమే.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు రాయొచ్చు..
స్టవ్ బర్నర్‌ను తీసివేసి చూస్తే కింద ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. ఆ రంధ్రంలో ఏదైనా చెత్త అడ్డుపడితే గ్యాస్ ప్రవాహం తగ్గి మంట తక్కువగా వస్తుంది. దీనికోసం ఒక సేఫ్టీ పిన్ లేదా సన్నని వైర్‌ను తీసుకుని, ఆ రంధ్రంలో నెమ్మదిగా గుచ్చి క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న అడ్డంకులు తొలగిపోయి గ్యాస్ ఫ్లో మళ్ళీ మామూలుగా మారుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే, ఈ పని చేసే ముందు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను కచ్చితంగా ఆఫ్ చేయాలి. భద్రత దృష్ట్యా ఇది చాలా ముఖ్యం. అలాగే, స్టవ్ నాబ్‌ను కూడా ఆఫ్ పొజిషన్‌లో ఉంచి, ఆ తర్వాతే నాజిల్ క్లీనింగ్ చేయాలి. ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే స్టవ్ ఎప్పుడూ కొత్తదానిలా పనిచేస్తుంది. అతి తక్కువ సమయంలో, రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే ఈ సింపుల్ హ్యాక్ మీ వంటింట్లో ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది.
ఇది చదవండి: అప్పుగా ఇచ్చిన వ్యక్తి తీర్చకుండా చనిపోతే.. ఇలా చేస్తే డబ్బు ఇంటికి ఈజీగా తిరిగి వస్తుంది
