Banana: రోజూ ఒక అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. తెలిస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అరటి పండ్లను తినేందుకు ఇష్టపడతారు. ఇది అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే చవకైన, అత్యంత పోషకమైన పండు. ఇందులో విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం పదండి.

తక్షణ శక్తిని అందించే పళ్లలో కూడా ఒకటి.. అరటిపండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తినడం వల్ల మన శరీరానికి కావలసిన అనే పోషకాలు అందుతాయి. అందుకే డాక్టర్లు కూడా అరటి పండ్లను తినాలని సిఫార్స్ చేస్తారు. అరటి పళ్లలో విటమిన్ సి, ప్రోటీన్, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి, రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
గుండె ఆరోగ్యానికి మేలు: మీరు రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే, ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
ఎముకల దృఢత్వం: అరటిపండు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తద్వారా తరచూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
జీర్ణక్రియ : అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మానసిక ఆరోగ్యం: అరటిపండులో ఉండే విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గించి, మీ మూడ్‌ని ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మెరిసే చర్మం: అరటి పండు చర్మ సంరక్షణలో కూడా చాలా ప్రభావవంతగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, సహజమైన కాంతిని ఇస్తుంది. అయితే అరటిపండు కేవలం శక్తినిచ్చే ఆహారమే కాదు, ఇది శరీరంలోని ప్రతి అవయవానికి మేలు చేసే ఒక ‘సూపర్ ఫుడ్’. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో ఒక అరటిపండును తప్పనిసరిగా చేర్చుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
