తెలంగాణ మటన్ కూర ఇలా వండితే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారంతే!
Prasanna Yadla
24 April 2026
Pic credit - Pixabay
తెలంగాణ స్టైల్‌లో పచ్చి మిర్చి, మసాలాలతో కూర చేస్తే అదిరిపోతోంది. దానిలో కొబ్బరి వేస్తే రుచి వస్తుంది.
తెలంగాణ మటన్ కూర
ఇది ఒకసారి తింటే మీ ఫుడ్ డైట్ లో దీనిని చేర్చుకుంటారు. ఇది అంత టేస్టీగా ఉంటుంది
తెలంగాణ మటన్ కూర
అరకిలో మటన్, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
మూడు పచ్చిమిర్చి , రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, నాలుగు కరివేపాకు ఆకులు,
అర కట్ట కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా మటన్‌ను తీసుకుని బాగా కడిగి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కుక్కర్‌లో బాగా ఉడికించుకోవాలి
స్టెప్ -1
పాన్ లో ఆయిల్ చేసి నాలుగు కరివేపాకు, ఐదు పచ్చిమిర్చి వేసి వాటిని బాగా వేయించుకోవాలి
స్టెప్ -2
ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా దీనిలో వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించుకోవాలి
స్టెప్ -3
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, మసాలాలు బాగా కలిపి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి