AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పాలు పుల్లగా మారుతున్నాయా.. ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి

వేసవిలో చల్లటి పాలతో లస్సీ, మామిడికాయ షేక్ వంటి రుచికరమైన డ్రింక్స్ ను తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో పాలను ఒకొక్కసారి అధిక మొత్తంలో తీసుకుంటారు. అయితే ఇలా తీసుకున్న పాలను బయట ఉంచితే..  పాలు పులుపు ఎక్కడమో.. లేదా విరిగిపోవడమో జరుగుతాయి. ఇంట్లో ఉన్న పాలు ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాడవకుండా కొన్ని రకాల వంటింటి చిట్కాలు మంచి ఉపశమనం ఇస్తాయి.

వేసవిలో పాలు పుల్లగా మారుతున్నాయా.. ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి
Kitchen Hacks Tips
Surya Kala
|

Updated on: Jun 06, 2024 | 1:01 PM

Share

వేసవి కాలం వస్తూనే కాదు.. వెళ్తూ కూడా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలను నిల్వ చేసుకోవడం ఒక పరీక్షలాంటిదే.. అందునా ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేని వారికి ఈ సీజన్‌లో సమస్య మరింత పెరుగుతుంది. నిజానికి వేడి వల్ల ఆహార పదార్థాలతో పాటు పాలు కూడా చాలా త్వరగా పాడవుతాయి. దీంతో ఒకొక్కసారి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న వేడి ఉక్కబోతతో వర్షాలు ఇలా డిఫరెంట్ వాతావరణ పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో ఆహారాన్ని వండి బయట ఉంచితే చాలా త్వరగా పాడైపోతుంది. అంతే కాదు ఈ సీజన్‌లో ఆఫీసుకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువవుతాయి. మధ్యాహ్న భోజనంలో కోసం తీసుకుని వెళ్లే ఆహారం వేడి వాతావరణం కారణంగా పాడైపోతుంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పాలు కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టకుండా ఎక్కువసేపు బయట ఉంచితే పుల్లగా మారతాయి. ఒకొక్కసారి పాలు విరిగిపోతాయి కూడా..

వేసవిలో చల్లటి పాలతో లస్సీ, మామిడికాయ షేక్ వంటి రుచికరమైన డ్రింక్స్ ను తయారు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. దీంతో పాలను ఒకొక్కసారి అధిక మొత్తంలో తీసుకుంటారు. అయితే ఇలా తీసుకున్న పాలను బయట ఉంచితే..  పాలు పులుపు ఎక్కడమో.. లేదా విరిగిపోవడమో జరుగుతాయి. ఇంట్లో ఉన్న పాలు ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాడవకుండా కొన్ని రకాల వంటింటి చిట్కాలు మంచి ఉపశమనం ఇస్తాయి. ఈ రోజు ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..

పాలను ఇలా మరిగించండి ప్యాక్ చేసిన పాలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినట్లయితే.. ఆ పాలు పాడైపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో పాలు పుల్లగా మారకూడదని భావిస్తే మార్కెట్ నుంచి పాలను ఇంట్లోకి తెచ్చిన తర్వాత గది ఉష్ణోగ్రతకు వచ్చిన వెంటనే మరిగించాలి. పాలు మరిగిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపి అవి చల్లారిన తర్వాత మాత్రమే రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

ఇవి కూడా చదవండి

రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి పాలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టె ప్లేస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. పెరుగు లేదా టమోటా కూరగాయల దగ్గర పాలు ఉంచవద్దు. అదే సమయంలో ఫ్రిజ్ డోర్ పక్కన పాల ప్యాకెట్లు లేదా సీసాలు ఉంచవద్దు. ఎందుకంటే ఫ్రిజ్ తలుపు తెరచినప్పుడు బయటి ఉష్ణోగ్రత ప్రభావం పడవచ్చు.

బయట ఎండకు పాలను ఎక్కువసేపు ఉంచవద్దు పాలు పుల్లగా మారకుండా ఉండటానికి, ఎక్కువసేపు రూమ్ లో ఉంచవద్దు. చల్లారిన పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి.. వాటిని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రిజ్ నుండి తీసి ఉపయోగించవచ్చు. , మళ్ళీ పని పూర్తయిన తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో ఉంచండి. పాలు అకస్మాత్తుగా చల్ల దనామ్ నుంచి వేడి ఉష్ణోగ్రతకు వస్తే.. పాలల్లో పసుపు పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది.

మరిని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..