AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అమ్మాయిల చెమట, రక్తం, ఉమ్మీ అంతా విషమే.. పాయిజన్ ఉమెన్స్‌ని ఎలా సృష్టించేవారో తెలుసా?

రాచరిక యుగంలో.. రాజులు, చక్రవర్తులు తమ శత్రువులను చంపడానికి లేదా వారి నుండి ఏదైనా రహస్య సమాచారాన్ని సేకరించేందుకు మహిళలతో వలపు వల విసిరేవారు.

ఆ అమ్మాయిల చెమట, రక్తం, ఉమ్మీ అంతా విషమే.. పాయిజన్ ఉమెన్స్‌ని ఎలా సృష్టించేవారో తెలుసా?
Poison Girls
Shiva Prajapati
| Edited By: |

Updated on: Mar 18, 2023 | 4:25 PM

Share

రాచరిక యుగంలో.. రాజులు, చక్రవర్తులు తమ శత్రువులను చంపడానికి లేదా వారి నుండి ఏదైనా రహస్య సమాచారాన్ని సేకరించేందుకు మహిళలతో వలపు వల విసిరేవారు. అయితే, ఆ మహిళలు అందగత్తెలే కాకుండా.. అత్యంత విషపూరితమైన వారు కూడా. అవును, ప్రస్తుత కాలంలో హ్యూమన్ బాంబ్‌తో వారిని పోల్చవచ్చు. నాటి రాజులు.. మహిళలను మానవ ఆయుధాలుగా వినియోగించేవారట. వారి అనువణువూ విషంతో నిండి ఉండేదట. వీరికి చిన్నప్పటి నుంచే విషాన్ని ఎక్కించడం ద్వారా.. విష కన్యలను సృష్టించేవారు నాటి రాజులు.

అందమైన అమ్మాయిలను విష కన్యలుగా మార్చేశారు..

రాజుల అక్రమ సంతానం, అనాథ, పేద బాలికలను అంతపురానికి తీసుకువచ్చి.. వారిని విష కన్యలుగా మార్చేవారని అనేక గ్రంధాలు చెబుతున్నాయి. అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే ప్యాలెస్‌లో ఉంచి, వారిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షించేవారు. కొన్ని రోజుల తరువాత వారిని విషపూరితం చేసే ప్రక్రియను ప్రారంభించేవారు. రాజమందిరంలోని వైద్యులు.. ఆ అమ్మాయిల శరీరంలో రోజూ కిద్ది మోతాదులో విషయం ఎక్కించేవారు. అలా క్రమంగా పెద్దయ్యేవరకు విషాన్ని ఎక్కించేవారు. అయితే, ఈ క్రమంలో కొందరు ఆడపిల్లలు చనిపోతే, మరికొందరు వికలాంగులుగా మారేవారట. ఇక సురక్షితంగా బయటపడిన వారిని తమ ఆయుధాలుగా వినియోగించేవారు రాజులు. అలా సురక్షితంగా బయటపడిన వారు ఎంతటి ప్రమాదకరం అంటే.. పాము కంటే డేంజర్. వారి ఉమ్మి, రక్తం, చెమట కూడా చాలా ప్రమాదకరం.

విష కన్యలకు ప్రత్యేక శిక్షణ..

ఈ విష కన్యలకు నాట్యం, పాట, సాహిత్యం అన్నింటిలోనూ ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. వీరు అందంలో దేవకన్యలను మించి ఉంటారు. ప్రతి కళలోనూ వీరిని నిష్టాతులగా తీర్చిదిద్దేవారు. ప్రత్యర్థి రాజుతో ఆకట్టుకునేలా వీరిని మలచేవారు. అలా శత్రువులపై ఉసిగొల్పి, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా శత్రు రాజులను అంతమొందించేవారు. ఈ విధంగా ప్రత్యర్థి రాజులను, ప్రముఖ శత్రులను చంపేందుకు నాటి రాజులు ఈ విష కన్యలను వినియోగించేవారని గ్రంధాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మిత్రిడాటిజం..

అమ్మాయిలను విషపూరితం చేసే ఈ ప్రక్రియను మిత్రిడాటిజం అంటారు. ఇందులో విషాన్ని రోగనిరోధక శక్తిగా మార్చడానికి ఒకరి శరీరంలోకి విషం నెమ్మదిగా ఇంజెక్ట్ చేయబడుతుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అన్ని రకాల విషాలతో మిత్రిడిటిజం చేయలేరు. దీని కోసం జీవశాస్త్రపరంగా మరింత సంక్లిష్టమైన నిర్మాణంతో కూడిన విషాన్ని మాత్రమే ఉపయోగిస్తారట. ఎందుకంటే, మన రోగనిరోధక వ్యవస్థ ఇలాంటి విషాలకు మాత్రమే ప్రతిస్పందిస్తుంది. ఒకే రకమైన విషాన్ని నిర్దిష్ట పరిమాణంలో పదేపదే ఇవ్వడం వల్ల, కాలేయం కండిషనింగ్ జరుగుతుంది. విషాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు.. ఆపిల్ లేదా అనేక ఇతర పండ్ల విత్తనాలలో సైనైడ్ ఉంటుంది. చాలాసార్లు మనం వాటి విత్తనాలను కూడా తింటాము. ఇది చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానికి అలవాటు పడిన మన కాలేయం దానిని జీర్ణం చేసేందుకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది.

హిందూ పురాణాలలో కూడా ప్రస్తావన..

గ్రీకు రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించటానికి బయలుదేరినప్పుడు, అతని గురువు అరిస్టాటిల్ భారతదేశంలోని విష కన్యల గురించి అతనికి చెప్పాడని అంటారు. భారతదేశాన్ని ఆక్రమించే సమయంలో ఇక్కడి అమ్మాయిలతో పెద్దగా సంబంధాలు పెట్టుకోకూడదని, ఒకవేళ అలా చేసినా.. అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకోవాలని సూచించాడట. ఈ విషయాన్ని చాణక్యుడి తన అర్థశాస్త్రం(క్రీ.పూ. 340-293)లో ప్రస్తావించడం జరిగింది.

ఆధునిక కాలంలోనూ విష కన్యలు..

ప్రాచీన కాలంలో విష కన్య ఉనికిని నిర్ధారించడానికి ఎలాంటి దృవీకరణ పత్రాలు అందుబాటులో లేవు. అయితే, ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం, జానపద కథలలో వీరి ప్రస్తావన, ఉనికిని ధృవీకరిస్తుంది. నేటికాలంలో హనీ ట్రాప్ అనేది నాటి విష కన్యతో పోల్చదగిన పదంగా పేర్కొంటున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..