Auto tips: మీ వెహికిల్ మైలేజ్‌ని పెంచుకోవాలా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. రెట్టింపు రేంజ్ ఖాయం..!

కారు కొనడం అనేది పెద్ద గొప్ప విషయమేమీ కాదు. అయితే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడమే అసలైన సవాలుతో కూడుకున్న పని. ఏ వాహనం విషయంలో..

Auto tips: మీ వెహికిల్ మైలేజ్‌ని పెంచుకోవాలా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. రెట్టింపు రేంజ్ ఖాయం..!
Auto Tips To Increase Mileage
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 18, 2023 | 5:07 PM

ప్రస్తుత కాలంలో కోటేశ్వరుడి నుంచి కూలీ పని చేసుకునేవారి వరకు.. కారు కొనడం అనేది పెద్ద గొప్ప విషయమేమీ కాదు. అయితే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయడమే అసలైన సవాలుతో కూడుకున్న పని. ఏ వాహనం విషయంలో అయినా మీకు తెలియనిది ఏముంది.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో సగం ట్యాంక్ నింపుకోవాలంటేనే తలకు మించిన భారంగా మారింది. వీటికి తోడు మన కారు లేదా ఏదైనా ఇతర వాహనం ఆశించినంతగా మైలేజీ ఇవ్వదు. అయితే ఈ క్రమంలో కొన్ని పద్దతులను పాటించడం ద్వారా మీ కారు లేదా ఇతర వాహన మైలేజీని పెంచుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పీడ్ మెయింటెనెన్స్:  ఫ్యూయెల్ ఖర్చు అనేది స్పీడ్ మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. యావ్రేజ్ స్పీడ్‌లో వెళ్తే ఫ్యూయెల్ తక్కువగా ఖర్చు అవుతుంది. అలా కాకుండా హెవీ స్పీడులో వెళ్తే.. ఆ స్పీడ్ పెరిగే కొద్ది ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలా ఈ టెక్నిక్స్ తెలుసుకుని నడిపితే మైలేజ్ పెంచుకోవడమే మాత్రమే కాదు.. కారు లేదా వెహికిల్ ఇంజన్ లైఫ్‌ని కూడా కాపాడుకోవచ్చు.

టైర్లలో ఎయిర్‌ సరిపడినంత ఉందా..?: నాలుగు టైర్లలో కూడా గాలి అనేది పూర్తిగా ఉందో లేదో బయలుదేరే ముందే చెక్ చేసుకోవాలి. నిర్దేశిత మోతాదు కన్నా గాలి తక్కువ ఉన్నట్లయితే, కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు మైలేజ్ భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. టైర్లలో ఫుల్ గాలి ఉన్నట్లయితే కారు వేగంతో పాటు మైలేజ్‌ను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

గేర్స్ సరిగ్గా మారుస్తున్నారా..?: కారు రన్నింగ్‌లో ఉన్నప్పుడు.. స్పీడ్‌కు తగ్గట్టుగా గేర్స్ మార్చాల్సి ఉంటుంది. వాహనం తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువ గేర్ వేస్తే ఇంజన్ ఆ స్పీడ్‌ను తట్టుకోలేక ఫ్యూయెల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంతమంది అవసరం లేని చోట కూడా ఎక్కువ గేర్లతో కారును మూవ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఇంజన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో మీ కారు మైలేజ్ కూడా తగ్గుతుంది.

ఇంజన్ మెయింటైనెన్స్: కారు ఇంజన్ సక్రమంగా లేకపోతే ఎక్కువ ఫ్యూయెల్ ఖర్చు అవుతుంది. ప్రధానంగా కారులో ఎయిర్ ఫిల్టర్ క్లీన్‌‌గా ఉండేలా చూసుకోవాలి. అది క్లీన్‌గా లేకపోతే.. ఎయిర్ ఫ్లోకు ఇబ్బంది అవుతుంది. ఆ కారణంగా ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో ఇంధనంపై అదనపు భారం పడుతుంది. తద్వారా ఎక్కువ ఇంధనం ఖర్చువుతుంది. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో కారులో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అంత ముఖ్యం.

ఇంజన్ ఆయిల్: వాహనం కొనుగోలు చేసినప్పుడు దానికి సంబంధిత ఇంజన్‌‌కి ఏ గ్రేడ్ ఆయిల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందో.. దానినే వినియోగించాల్సి ఉంటుంది. కొంత మంది ఈ నియమాన్ని పాటించక మైలేజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలా సూచించిన గ్రేడ్ ఆయిల్ ఉపయోగిస్తేనే.. ఇంజన్ కూడా సరైన మైలేజ్ ఇస్తుంది. మనిషికి రక్తం ఎంత ముఖ్యమో ఇంజన్‌కి ఆయిల్ అంత ప్రధానం.

క్లచ్ వాడే విధానం: కారు నడిపేటప్పుడు మనం క్లచ్‌ను ఎలా వాడుతున్నాం అనేది కూడా ముఖ్యమే. కొంతమంది క్లచ్ పెడల్‌పై పాదాన్ని పెట్టి అలాగే నడుపుతుంటారు. అలా ఎప్పుడూ ఉంచొద్దు. క్లచ్ ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. ఇది మాత్రమే కాదు.. యాక్సిలరేటర్ కూడా ఒకేసారి సడెన్‌‌గా ఉపయోగించకూడదు. మరీ ముఖ్యంగా బ్రేక్‌ల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఒకేసారి సడెన్‌గా బ్రేక్ వేయడం, మళ్లీ వెంటనే యాక్సిలరేట్ ఇవ్వడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇవే మైలేజ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

అందువల్ల మీ కార్ లేదా వెహికిల్ మైలేజ్ ఎందుకు తగ్గుతోందని కంగారు పడకుండా.. దానికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకుని దానిని సరిచేసుకోండి. కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే మీరు మైలేజ్ మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి పైన తెలిపిన విధంగా కొన్ని కొన్ని స్మార్ట్ టిప్స్‌ని పాటిస్తూ మీ వెహికిల్ మైలేజ్‌ని పెంచుకోండి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!