Pearls Harvest : ఇంటి వెనుక పెరట్లో ముత్యాలు పండిస్తున్న రైతు.. ఏకంగా లక్షలు అర్జిస్తున్నాడు..

సాధారణంగా ముత్యాలు ఎక్కడ లభిస్తాయి..? ఏం ప్రశ్న అడుగుతున్నారు..? నదులు, సముద్రాలు, చెరువుల్లో దొరుకుతాయి.. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు సేకరిస్తారు. అది కూడా తెలీదా...

Pearls Harvest : ఇంటి వెనుక పెరట్లో ముత్యాలు పండిస్తున్న రైతు.. ఏకంగా లక్షలు అర్జిస్తున్నాడు..
Pearls Harvest
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 08, 2021 | 8:12 PM

సాధారణంగా ముత్యాలు ఎక్కడ లభిస్తాయి..? ఏం ప్రశ్న అడుగుతున్నారు..? నదులు, సముద్రాలు, చెరువుల్లో దొరుకుతాయి.. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు సేకరిస్తారు. అది కూడా తెలీదా అని మీరు అంటారేమో. ఆగండాగండి… కేరళకు చెందిన ఒక రైతు ఏకంగా తన పెరట్లో ముత్యాలు పండిస్తూ అందరిని ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. ఇంట్లోనే ముత్యాలు సాగుతో ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాడు. కేరళకు చెందిన మతాచన్ సౌదీ అరేబియాలోని పెట్రోలియం  అండ్ మినరల్ యూనివర్శిటీలో  టెలికమ్యునికేషన్స్ విభాగంలో ఫ్రొఫెసర్ గా పని చేసేవాడు. యూనివర్సిటీ పని మీద ఒకసారి చైనాకు వెళ్ళాల్సి వచ్చింది. చైనాలో ముత్యాల సాగులో డిప్లొమా అందిస్తున్నారని తెలిసి, ఆసక్తి కొద్దీ చేరాడు. ఈ తరహా విద్యను మన దేశంలో కొద్దిమంది మాత్రమే చదివారు.

కేరళకు తిరిగొచ్చిన మతాచన్… తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఇంటి పెరట్లోనే ముత్యాల సాగు మొదలు పెట్టాడు. నదులలో దొరికే ఆల్చిప్పలను తెచ్చి 18 నెలలు బకెట్లో ఉంచి ముత్యాలను ఉత్పత్తి చేసాడు. వాటి ద్వారా 4.5లక్షలు అర్జించాడు. దీంతో ఈ ముత్యాల సాగుపై అతడి మరింత పెరిగింది. ముత్యాల సాగుకోసం మతాచన్ ప్రారంభ పెట్టుబడి లక్షన్నర మాత్రమే పెట్టాడు. తొలిగా అతను అందుకున్న లాభం రూ.3లక్షలు.  ముత్యాలసాగును చేపట్టిన తొలినాళ్ళల్లో మతాచన్ చేస్తున్న పని చూసి కొందరు ‘ఇదేం పిచ్చి’ పని అంటూ హేళన చేశారు. అయితే పెరట్లో పండించిన ముత్యాలను చూసి వారంతా కంగుతిన్నారు. గత 20 సంవత్సరాలుగా మతాచన్ ఇదే పని చేస్తున్నాడు. ఉత్పత్తి చేసిన ముత్యాలలో ఎక్కువ భాగాన్ని అస్ట్రేలియా, సౌదీ అరేబియాకి ఎగుమతి చేస్తున్నాడు.

ప్రస్తుతం మతాచాన్ స్ధానిక నిరుద్యోగ యువతకు ముత్యాల సాగుపై ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. శిక్షణ కోసం 10వేలు ఫీజుగా తీసుకుంటున్నాడు. చాలామంది రైతులు మతాచన్ దగ్గర శిక్షణ తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మంచి నీటి సరస్సుల దగ్గర విరివిగా దొరికే ముత్యపు చిప్పలతో మన దేశంలో కూడా ముత్యాల సాగు చేపడితే మంచి లాభాలు ఉంటాయని తనను తానే ఉదాహరణగా చూపతున్నాడు మతాచన్.

Pearls

Pearls

Also Read: ‘గోల్డెన్ కపుల్’.. ఒంటిపై మాత్రమే కాదు, ఆ దంపతుల చెప్పులకు, సెల్‌ఫోన్లకు కూడా బంగారమే

పెళ్లి కొడుకైన కుమారుడిని అందరి ముందు చెప్పుతో కొట్టిన తల్లి…!! ఎందుకలా.. ?? ఎక్కడ..??

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!