Kadaknath Chicken : కడక్‌నాథ్ చికెన్‌కు విదేశాలలో కూడా డిమాండ్..! లాభసాటి వ్యాపారానికి ప్రభుత్వ సహకారం..
Kadaknath Chicken : కడక్‌నాథ్ చికెన్‌కి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. కడక్‌నాథ్ చికెన్,
Kadaknath Chicken : కడక్‌నాథ్ చికెన్‌కి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. కడక్‌నాథ్ చికెన్, ఎముకలు, రక్తం అన్నీ నల్లగా ఉంటాయి. ఈ కారణంగా ప్రజలు కడక్‌నాథ్‌ను బ్లాక్ కాక్ అని కూడా పిలుస్తారు. అదే సమయంలో గిరిజన ప్రాంతంలో ఇది కలిమసి అని ప్రసిద్ది చెందింది. ఔషధ, పోషక లక్షణాలను కలిగి ఉన్నందున వీటికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.
ఇప్పుడు మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గడ్‌లోనే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో వీటిని పెంచుతున్నారు. కోడిపిల్లల పెంపకం కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ చెందిన కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) సకాలంలో కోడిపిల్లలను అందించలేకపోతున్నాయి. ఈ కోడి మాంసం తినడం ద్వారా శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
పెరుగుతున్న వ్యాపారం.. కడక్‌నాథ్ చికెన్‌లో ఇనుము, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ పెరుగుతోంది. గల్ఫ్ దేశాలలో దీనిని చాలా ఇష్టపడుతున్నారు. కడక్‌నాథ్ చికెన్ డిమాండ్ ఉండటం వల్ల మంచి లాభసాటి బిజినెస్‌గా గుర్తింపు సంపాదించింది. కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తుంది.
మీరు కడక్‌నాథ్ చికెన్ వ్యాపారం చేయాలంటే కృషి విజ్ఞ్యాన్ కేంద్రం నుంచి కోడిపిల్లలను కొనుగోలు చేయవచ్చు. కొంతమంది రైతులు 15 రోజుల కోడిపిల్లలను తీసుకుంటారు, మరికొందరు ఒక రోజు కోడిపిల్లలను తీసుకుంటారు. కడక్‌నాథ్ కోడి మూడున్నర నుంచి నాలుగు నెలల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. 90 వ దశకంలో కడక్‌నాథ్ జాతులు అంతరించిపోయే దశలో ఉండేవి. తరువాత శాస్త్రవేత్తల సాయంతో ఈ జాతికి కొత్త జీవితం లభించింది. కడక్‌నాథ్ కోడిపిల్లల డిమాండ్ సకాలంలో నెరవేరడం లేదు. దేశవ్యాప్తంగా దీనికి జనాధరణ పెరిగింది. కోడిపిల్లల పెంపకం కోసం ప్రతిచోటా డిమాండ్ ఉంది.