Brushing Mistakes : బ్రష్ చేసేటప్పుడు చాలామంది ఈ తప్పులు చేస్తారు..! ఇది మీ దంతాలు, చిగుళ్లను ప్రభావితం చేస్తుందని తెలుసా..?

Brushing Mistakes : దంతాలు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచడానికి రెగ్యులర్‌గా బ్రషింగ్ అవసరమని అందరికి తెలుసు. కరోనా వైరస్,

Brushing Mistakes : బ్రష్ చేసేటప్పుడు చాలామంది ఈ తప్పులు చేస్తారు..! ఇది మీ దంతాలు, చిగుళ్లను ప్రభావితం చేస్తుందని తెలుసా..?
Brushing
Follow us
uppula Raju

|

Updated on: Jul 12, 2021 | 11:51 AM

Brushing Mistakes : దంతాలు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచడానికి రెగ్యులర్‌గా బ్రషింగ్ అవసరమని అందరికి తెలుసు. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులతో పోరడుతున్నప్పుడు దంతాల బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం. మీరు మీ దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అందుకే రోజూ బ్రష్ చేయడం ముఖ్యం. అయితే చాలామంది బ్రష్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఇది మీ దంతాలు, చిగుళ్ళను ప్రభావితం చేస్తుంది. ఈ సాధారణ తప్పుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. వేగంగా బ్రష్ చేయడం వేగంగా బ్రష్ చేయడం వల్ల ఎనామిల్‌ దెబ్బతింటుంది. కాలక్రమేణా చిగుళ్ళను దెబ్బతీస్తుంది. అందుకే మృదువైన బ్రష్‌‌ను వాడటం మంచిది. తద్వారా రక్తస్రావం జరగదు.

2. టూత్ బ్రష్ మార్చడం లేదు మీ టూత్ బ్రష్ ముళ్ళగరికెలు అరిగిపోతుంటే దాని స్థానంలో కొత్తది తీసుకోవాలి. ప్రతి 3 నెలలకు టూత్ బ్రష్ మార్చాలని దంతవైద్యులు చెబుతున్నారు.

3. లాంగ్ బ్రషింగ్ 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేయడం మంచిది. ఎక్కువసేపు బ్రష్ చేయడం ద్వారా పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

4. తరచుగా బ్రష్ చేయడం రోజు రెండుసార్లు బ్రష్ చేస్తే సరిపోతుంది. ఉదయం తర్వాత రాత్రి నిద్రపోయే ముందు చేయాలి. ఇది మీ దంతాలను పూర్తిగా శుభ్రపరుస్తుంది. అధికంగా బ్రష్ చేయడం వల్ల మీ దంతాలు, చిగుళ్ళు బలహీనపడతాయి.

5. దంతాల ఉపరితలం విస్మరిస్తుంది దంతాల లోపలి భాగాన్ని శుభ్రపరిచేలా చూసుకోండి. ఎందుకంటే అక్కడ సూక్ష్మక్రిములు ఉండవచ్చు. అన్ని వైపుల నుంచి మీ దంతాలను బ్రష్ చేయండి. కనిపించని వాటిని కూడా శుభ్రం చేస్తే రోజు మొత్తం తాజాగా ఉంటారు.

Kadaknath Chicken : కడక్‌నాథ్ చికెన్‌కు విదేశాలలో కూడా డిమాండ్..! లాభసాటి వ్యాపారానికి ప్రభుత్వ సహకారం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

AP-Odisha Kotiya war: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య కొటియా యుద్ధం.. ఎందుకు జరుగుతోంది.. ఎవరు రాజేస్తున్నారు..