Bike: మీ బైక్‌లో ఈ మాడిఫికేషన్స్ చేశారా.? జరిమానా చెల్లించక తప్పదు..
వాహనాలను మాడిఫికేషన్స్ చేసుకోవడం ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్‌లా మారింది. కార్లు, బైక్‌లు అనే తేడా లేకుండా రకరకాలుగా మార్పులు చేసుకుంటున్నారు. కంపెనీతో వచ్చి మోడల్ కాకుండా తమకు నచ్చినట్లు మార్పులుచేర్పులు చేసుకుంటున్నారు. అయితే.. నా బైక్ నా ఇష్టం అంటే కుదరదని మీకు తెలుసా.? మీరు చేసుకునే మాడిఫికేషన్ కచ్చితంగా కొన్ని...

వాహనాలను మాడిఫికేషన్స్ చేసుకోవడం ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్‌లా మారింది. కార్లు, బైక్‌లు అనే తేడా లేకుండా రకరకాలుగా మార్పులు చేసుకుంటున్నారు. కంపెనీతో వచ్చి మోడల్ కాకుండా తమకు నచ్చినట్లు మార్పులుచేర్పులు చేసుకుంటున్నారు. అయితే.. నా బైక్ నా ఇష్టం అంటే కుదరదని మీకు తెలుసా.? మీరు చేసుకునే మాడిఫికేషన్ కచ్చితంగా కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలి. లేదంటే ట్రాఫిక్ అధికారులు మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇంతకీ బైక్‌లో ఎలాంటి మాడిఫికేషన్స్ చేస్తే అధికారులు జరిమానా విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎక్కువగా సౌండ్ వచ్చే సైలెన్సర్‌ను మార్చుకోవడం చట్ట విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కేవలం సౌండ్ మాత్రమే కాకుండా పొగ కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాయు, ధ్వని కాలుష్యానికి కారణమవుతుందన్న కారణంతో మీకు జరిమానా విధించడమే కాకుండా సైలెన్సర్‌ను కూడా తొలగిస్తారు.
* ఇక మీ బైక్ కలర్‌ను మీకు నచ్చినట్లు మార్చుకోవడానికి కూడా వీల్లేదు. ఆర్‌టీఓ అనుమతి లేకుండా బైక్ కలర్ మార్చితే చలాన్ విధించే అవకాశాలు ఉంటాయి.
* నెంబర్ ప్లేట్స్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫ్యాన్సీ నెంబర్స్, కనిపించీ కనిపించకుండా ఉండే నెంబర్స్ కలిగిన ప్లేట్స్‌ను ఉపయోగించే చలాన్ జారీ చేసే అవకాశం ఉంటుంది.
* బైక్స్ హ్యాండిల్ బార్స్‌ను మాడిఫికేషన్ చేసినా చలాన్లు విధిస్తారు. చాలా ఎత్తుగా లేదా వెడల్పుగా ఉన్న హ్యాండిల్ బార్లను ఉపయోగించడం చట్ట విరుద్ధం.
* కొందరు బైక్ సీట్స్‌ను కూడా మాడిఫికేషన్ చేస్తుంటారు. అయితే ఇలా చేసినా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సీటు సైజ్‌ను పెద్దగా చేసినా, మరీ చిన్నగా చేసినా చలాన్ చెల్లించకతప్పదు.
* లైట్స్ విషయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాలి. ప్రామాణికం కాని ఎరుపు రంగు, నీలం రంగు, ఫ్లాషింగ్ లైట్స్‌ను ఉపయోగించినా చలాన్ విధిస్తారు.
* సరైన్ సైడ్ మిర్రర్స్ ఉపయోగించకపోయినా అధికారులు చలాన్ విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
* ఇక కొందరు టైర్లను కూడా తమకు నచ్చినట్లు మార్చేస్తుంటారు. అయితే టైర్ల సైజ్‌లు పెంచితా, తగ్గించినా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. రోడ్డుపై వెహికిల్ పట్టు తప్పే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే నిషేధించారు. బైక్స్‌లో ఎలాంటి మార్పులు చట్ట విరుద్ధమన్న విషయాలను ఆర్‌టీఓ సైట్స్‌లో సవివరంగా తెలిపారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
