Beetroot Halwa Recipe: రక్తాన్ని శుభ్రపరిచే బీట్‌రూట్‌ని మీ పిల్లలు తినడంలేదా.. హల్వాగా చేసి పెడితే సరి.. రెసిపీ ఏమిటంటే!

బీట్ రూట్ తో కూర, జ్యుస్ నే కాదు.. ఎంతో రుచికరమైన స్వీట్ ను తయారు చేసుకోవచ్చు.. బీట్ రూట్ హాల్వా చిన్నపిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఈరోజు బీట్ రూట్ తో హాల్వా తయారీకి కావాల్సింది ఏమిటి..? ఎలా తయారు చేసుకోవాలి..

Beetroot Halwa Recipe: రక్తాన్ని శుభ్రపరిచే బీట్‌రూట్‌ని మీ పిల్లలు తినడంలేదా.. హల్వాగా చేసి పెడితే సరి.. రెసిపీ ఏమిటంటే!
Follow us

|

Updated on: Feb 22, 2021 | 1:43 PM

Beetroot Halwa Recipe : మనకు ప్రకృతి లో సహజంగా లభించే పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇక దుంపల్లో ఒకరైన బీట్ రూట్ తో ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా బీట్ రూట్ లో నైట్రేట్ నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌ మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. దీంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిర్వరిస్తుంది. ఇంత ఆరోగ్య ప్రయోజనాన్ని ఇచ్చే బీట్ రూట్ ను తినడానికి చాలా మంది ఇష్టపడరు.. బీట్ రూట్ తో కూర, జ్యుస్ నే కాదు.. ఎంతో రుచికరమైన స్వీట్ ను తయారు చేసుకోవచ్చు.. బీట్ రూట్ హాల్వా చిన్నపిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈరోజు బీట్ రూట్ తో హాల్వా తయారీకి కావాల్సింది ఏమిటి..? ఎలా తయారు చేసుకోవాలి.. చూద్దాం!

బీట్ రూట్ హల్వా తయారీకి కావాల్సిన పదార్దాలు:

బీట్ రూట్ ————— 2 (300 గ్రాములు) నెయ్యి —————– 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు (కావల్సినంత) పాలు —————– 300 ఎంఎల్ చక్కెర —————– అరకప్పు (100 గ్రాములు) జీడిపప్పు ————— 10 నుంచి 12 బాదంపప్పు ————- 8 నుంచి 10 ఎండు ద్రాక్ష ————- ఒక టేబుల్ స్పూన్ యాలకులు ————- రుచికి తగినంత

బీట్ రూట్ హల్వా తయారీ విధానం:

ముందుగా బీట్ రూట్ ను శుభ్రపరిచి .. తురుము కోవాలి. అనంతరం స్టౌ మీద బాణలి పెట్టి.. కొంచెం వేడి ఎక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేయాలి. అనంతరం శుభ్రపరిచిన బీట్ రూట్ తురుమును అందులో వేయాలి. మీడియం మంటపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు (అంటే పచ్చి వాసన పోయి. కమ్మగా స్మెల్ వచ్చేవరకూ) ఆ మిశ్రమాన్ని వేయించాలి. తర్వాత పాలను కలిపి తక్కువ లేదా మీడియం మంటపై వేడి చేయాలి. ఇప్పుడు చక్కెర వేసి అది ఆవిరయ్యేంత వరకు ఉడికించాలి. అనంతరం జీడిపప్పు, బాదం, యాలకులను వేసుకోవాలి.. ఇష్టపడే వారు ఇతర డ్రైఫ్రూట్లను వేసుకోవచ్చు. దీంతో రుచికరమైన బీట్ రూట్ హల్వా సిద్ధమవుతుంది.

Also Read:

వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.. లేదంటే ప్రపంచకప్ వేదిక మార్చాల్సివస్తుంది.. భారత్ కు పాక్ హెచ్చరిక

 బాలీవుడ్ పార్టీల్లో మునిగి తేలుతున్న ‘రౌడీ బాయ్‌’ అండ్‌ టీమ్‌.. వైరల్‌గా మారిన ఫొటోలు..