వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.. లేదంటే ప్రపంచకప్ వేదిక మార్చాల్సివస్తుంది.. భారత్ కు పాక్ హెచ్చరిక

ఈ ఏడాది మరో ప్రపంచ కప్ నిర్వహణకు భారత్ వేదిక కానున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డు అప్పుడే తన అక్కసును ఓ రేంజ్ లో వినిపిస్తోంది. భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనడానికి..

  • Surya Kala
  • Publish Date - 1:13 pm, Mon, 22 February 21
వీసాల విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.. లేదంటే ప్రపంచకప్ వేదిక మార్చాల్సివస్తుంది.. భారత్ కు పాక్ హెచ్చరిక

T20 World Cup: ఈ ఏడాది మరో ప్రపంచ కప్ నిర్వహణకు భారత్ వేదిక కానున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డు అప్పుడే తన అక్కసును ఓ రేంజ్ లో వినిపిస్తోంది. భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనడానికి పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు జర్నలిస్టులకు అభిమానులకు భారత్ వీసాలు మంజూరు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అంతేకాదు.. ఇదే విషయంపై మార్చి నెలాఖరులోగా బీసీసీఐ తన నిర్ణయం చెప్పాలని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి చెప్పారు. ఈ మేరకు బీసీసీఐ లిఖిత పూర్వక హామీనివ్వాలని.. త్వరలోనే ఫాన్స్ కు జర్నలిస్టులకు వీసాలు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు..

అలా బీసీసీఐ చేయకపోతే ప్రపంచకప్ టీ 20 వేదికలను మార్చమని అదీ యూఏఈ కి వేదిక మార్చమని ఐసీసీ కి లేఖ రాస్తామని మణి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ను హెచ్చరించారు. అంతేకాదు ఇక నైనా ఐసీసీలో పెద్దన్నలుగా ఉన్న మూడు క్రికెట్ బోర్డులు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇక పుల్వామా దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో క్రీడా సంబంధాలు కూడా బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ద్విపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు.. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ నెలల్లో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. దీనికి సంబంధించిన వీసాలను మార్చిలోగా మంజూరు చేయాలని పీసీబీ కోరుతున్నది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.

Also Read:

 హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ రాజధాని అని చెప్పుకోవడం గర్వంగా ఉంది.. ‘బయో ఎషియా’లో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు..

ప్రాణం తీసిన ఇసుక.. వికారాబాద్ జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడ్డ మాజీ ఎంపీపీ భర్త మృతి..!