Viratk Kohli: ‘విరాట్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటాడు’.. టీమిండియా సారథిపై పొగడ్తలు కురిపించిన మాజీ సెలక్టర్‌..

Saran deep Singh About Virat Kohli's Attitude: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఎంతో మంది అభిమానులున్నారు. క్రికెట్‌ గురించి అవగాహనలేని వారు కూడా విరాట్‌ స్టైల్‌కు ఫిదా అవుతుంటారు. విరాట్‌కు యూత్‌లో ఉన్న...

Viratk Kohli: 'విరాట్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటాడు'.. టీమిండియా సారథిపై పొగడ్తలు కురిపించిన మాజీ సెలక్టర్‌..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 2:12 PM

Saran deep Singh About Virat Kohli’s Attitude: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఎంతో మంది అభిమానులున్నారు. క్రికెట్‌ గురించి అవగాహనలేని వారు కూడా విరాట్‌ స్టైల్‌కు ఫిదా అవుతుంటారు. విరాట్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుంటూ ప్రముఖ బ్రాండ్లు సైతం ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌లు నియమించుకుంటున్నాయి. ఇక మైదానంలో జట్టును గెలిపించడానికి విరాట్‌ ఎంతో కృషి చేస్తుంటాడు. అయితే విరాట్‌కు చాలా కోపం, ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటాడని కొందరు వాదిస్తుంటారు. తాజాగా మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ విరాట్‌ కోహ్లి వ్యవహార శైలిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానం లోపల ఉండే కోహ్లీకి, బయట ఉండే కోహ్లికి చాలా తేడా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. భార్య అనుష్కతో కలిసి ఉండే ఇంట్లో అసలు పని వారే ఉండరు, అతిథులకు అతను, తన భార్య భోజనం వడ్డి భోజనం వడ్డిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్‌ మనతోనే కూర్చొని మాట్లాడుతాడు, మనతో కలిసి బయటకు విందుకు వస్తాడని తెలిపాడు. మిగతా ఆటగాళ్లకు కూడా కోహ్లి అంటే ఎంతో గౌరవమని శరణ్‌ దీప్‌ అభిప్రాయపడ్డాడు. విరాట్‌ ఎంతో ఎత్తుకు ఎదిగినా చాలా సాధారణంగా ఉంటాడు’ అంటూ శరణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. శరన్‌ దీప్‌ విరాట్‌ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘విరాట్‌ను మైదానంలో చూస్తే చాలా కోపంగా, ర్యూడ్‌ బిహేవియర్‌తో ఉంటాడని, ఎవరి మాట వినడని అందరూ భావిస్తుంటారు. కానీ అతను చాలా సింపుల్‌. సెలక్షన్‌ సమావేశాల్లో విరాట్‌ చాలా సౌమ్యంగా ఉంటాడు. అందరి మాటలు విన్న తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.

Also Read: IPL 2021 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!