ప్రాణం తీసిన ఇసుక.. వికారాబాద్ జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడ్డ మాజీ ఎంపీపీ భర్త మృతి..!

ఇసుక పంచాయతీ వర్గపోరులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్యకు గురయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:02 pm, Mon, 22 February 21
ప్రాణం తీసిన ఇసుక.. వికారాబాద్ జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడ్డ మాజీ ఎంపీపీ భర్త మృతి..!

Man murdered brutally : ఇసుక పంచాయతీ వర్గపోరులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం హన్మాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మాపూర్ గ్రామ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం తరలిస్తున్న ఇసుక వివాదానికి దారితీసింది. ఆదివారం గ్రామ సర్పంచ్ భర్త వెంకటేష్ ఇసుక తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ భర్త వీరన్న కూడా ఇసుక కోసం అక్కడికి వెళ్లారు. ఇసుక తరలింపుపై సర్పంచ్ భర్త , మాజీ ఎంపిపి భర్త మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఈ ఇసుక గొడవ కాస్త సోమవారం చావిడి వద్ద పంచాయతీ కారణమైంది.

దీంతో ఈ పంచాయతీలో సర్పంచ్ భర్త వెంకటేష్ మాజీ ఎంపీపీ వీరన్న వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ వీరన్నను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇదిలావుంటే, ఈ ఇసుక పంచాయతీకి సంబంధించి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ హత్యకు దారి తీసిందని గ్రామస్తులు వాపోతున్నారు.

Read Also…  ఎదురు కాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ.. కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా పేలిన మందుపాతర.. ఓ జవాన్‌కు తీవ్ర గాయాలు