ఎదురు కాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ.. కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా పేలిన మందుపాతర.. ఓ జవాన్‌కు తీవ్ర గాయాలు

విశాఖ ఏజెన్సీలో కుంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ఎఫ్ బెటాలియన్ కు చెందిన..

  • K Sammaiah
  • Publish Date - 12:42 pm, Mon, 22 February 21
ఎదురు కాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ.. కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా పేలిన మందుపాతర.. ఓ జవాన్‌కు తీవ్ర గాయాలు

విశాఖ ఏజెన్సీలో కుంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ఎఫ్ బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం రాయపూర్ తరలించారు.

ఏవోబీ లో గల మల్కన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాల్ దాలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకుబీఎస్ఎఫ్ జవాన్లు ఆప్రాంతంలో కుంబింగ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లాండ్ మైన్ పేల్చారు.

మావోయిస్టుల ఎదురు కాల్పులతో వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ తప్పిచుకున్నారు. తప్పిచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.