పీవీ కుమార్తెకు బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్ నేతలకు దిశానిర్ధేశం చేసిన సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారవు కుమార్తె శ్రీమతి సురభి వాణిదేవి
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారవు కుమార్తె శ్రీమతి సురభి వాణిదేవికి సీఎం కేసీఆర్ బీఫారం అందించారు. రంగా రెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ పట్ట బద్రుల ఎన్నికలలో TRS అభ్యర్థి గా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కుమార్తె వాణీ దేవి కి ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కెసిఆర్ గారు…ఆ మేరకు..నేడు ప్రగతి భవన్ లో బి ఫారం అంద జేశారు.
అంతకు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి కేసీఆర్ బీ ఫార్మ్ అందజేశారు. సమావేశం ముగిసిన అనంతరం వాణిదేవి.. గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపానికి వాణిదేవి నివాళులర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెల్లి నామినేషన్ దాఖలు చేశారు. సీఎంతో సమావేశం కంటే ముందు.. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద వాణిదేవి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
Read more: