గిరిజన ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం. నడిరోడ్డుపై మనిషి ఆకారంలో ముగ్గులు,కుంకుమ జల్లిన ఆనవాళ్లు. వైరల్‌ వీడియో

Black Magic: ప్రశాంతంగా ఉండే ఆ గిరిజన పల్లె ఉలిక్కిపడుతోంది. క్షుద్ర పూజల ఆనవాళ్లు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

గిరిజన ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం. నడిరోడ్డుపై మనిషి ఆకారంలో ముగ్గులు,కుంకుమ జల్లిన ఆనవాళ్లు. వైరల్‌ వీడియో
black-magic
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 22, 2021 | 1:24 PM

Black Magic: ప్రశాంతంగా ఉండే ఆ గిరిజన పల్లె ఉలిక్కిపడుతోంది. క్షుద్ర పూజల ఆనవాళ్లు అక్కడి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామ శివార్లలో అందరూ నడిచే రోడ్డుపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రాత్రుళ్లు వింత పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామానికి ఏ అరిష్టం జరుగుతుందోనని, ఆ పల్లెల్లో జనం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గత రెండు మూడు,రోజులుగా ఆ గ్రామంలో అందరూ నడిచే రోడ్డుపై రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. నడిరోడ్డుపై మనిషి ఆకారంలో ముగ్గులు వేసి, పసుపు, కుంకుమ జల్లి, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఆగరవత్తులతో పూజలు జరిగినట్లు ఆనవాళ్లు ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రెండు గ్రామాల సరిహద్దుల్లో జరుగుతున్న ఈ క్షుద్రపూజల కారణంగా ప్రజలు ఊరు దాటి వెళ్లేందుకు భయపడిపోతున్నారు. పోలీసులకు పరిస్థితి గురించి వివరించి.. ఫిర్యాదు చేద్దామంటే..తమపై ఎక్కడ చేతబడులు చేస్తారోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!