టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై దిశానిర్ధేశం..!
KCR on Graduate MLC election : తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
CM KCR Meet : తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థిగా వాణీదేవికి బీఫామ్ అందించారు.
Telangana CM K Chandrasekhar Rao hands over B-Form (denoting that candidate is approved by party & should be allotted its symbol) to Surabhi Vani Devi, ex-PM PV Narasimha Rao’s daughter
CM announced her candidature from Graduates’ constituency for State Legislative Council polls pic.twitter.com/UIpgwWpzwX
— ANI (@ANI) February 22, 2021
ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహంపై మూడు జిల్లాల కీలక నేతలతో చర్చించారు సీఎం కేసీఆర్. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాణీదేవిని పరిచయం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పని చేయాలని కేసీఆర్ నేతలకు దిశానిర్ధేశం చేశారు. వాణీదేవి ఇప్పటికిప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రచారాన్ని కొనసాగించాలని కేసీఆర్ సూచించారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం వాణిదేవి.. గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపానికి వాణిదేవి నివాళులర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. సీఎంతో సమావేశం కంటే ముందు.. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద వాణిదేవి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.