Domicile Certificate: ఉన్నత చదవుల కోసం ఈ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..
నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేయడానికి మీకు కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది. మీరు దీన్ని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ముందుగా..

Domicile Certificate: ప్రభుత్వ లేదా ప్రైవేట్ పని కోసం గుర్తింపు పత్రాలు అవసరం ఉంటుంది. ఇలాంటివాటిలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్‌తో సహా అనేక ఇతర పత్రాలు ఉన్నాయి. అవి లేకుండా ఎలాంటి పని పూర్తి కాదు. వాటిలో వాటిలో మరో పత్రం కూడా ఉంటుంది. అదే డొమిసిల్ సర్టిఫికేట్.. లేదా శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. వాస్తవానికి, ప్రతి రాష్ట్రంలోని నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండటం అవసరం. మీరు గత 15 సంవత్సరాలుగా ఏదైనా రాష్ట్రంలో నివసిస్తున్నట్లయితే.. మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అవసరం ఏర్పడుతుంది. కానీ మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అందుబాటులో లేనట్లయితే.. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా కళాశాలలో అడ్మిషన్ అవసరం ఏర్పడుతుంది. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏ విధంగానైనా పొందవచ్చు. ఈ పత్రం ఎలా పొందాలో మనం తెలుసుకుందాం..
నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేయడానికి మీకు కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది. మీరు దీన్ని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ముందుగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోండి..
ఈ పత్రాలు అవసరం:
1. దరఖాస్తుదారు ఆధార్ కార్డ్- ఆధార్ కార్డ్ అనేది భారతదేశ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. ప్రభుత్వ పని అయినా..ప్రైవేట్ పని అయినా.. దాదాపు ప్రతి పనికి ఇది అవసరం. ఆధార్ కార్డు లేకుండా పని పూర్తి కాదు. అదే సమయంలో మీరు డొమిసైల్ సర్టిఫికేట్‌ను పొందడానికి అవసరమైనదానిలో తొలి పత్రం .
2. రేషన్ కార్డ్- ఆధార్ కార్డు తర్వాత రెండవ ముఖ్యమైన పత్రం రేషన్ కార్డు. రేషన్ కార్డు అందుబాటులో ఉన్న వారి నివాస ధృవీకరణ పత్రం సులభంగా తీసుకోవచ్చు.
3. ఓటర్ ID కార్డ్- ఓటరు ID కార్డ్ ప్రతి భారతీయ పౌరునికి అందుబాటులో ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేయడానికి.. రేషన్ కార్డు ఫోటోకాపీ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పత్రాలను ముందుగానే రెడీ చేసుకోవాలి.
4. జనన ధృవీకరణ పత్రం- జనన ధృవీకరణ పత్రం మీ వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ పత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే నివాస ధృవీకరణ పత్రాన్ని తయారు చేయడానికి జనన ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. మీకు అనేక ఇతర ప్రదేశాలలో కూడా ఇది అవసరం కావచ్చు.
5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో– ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండింటి విషయంలో మీకు 2 నుండి 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు కూడా అవసరం. ఇది కాకుండా, మీరు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినట్లైతే.. నివాస ధృవీకరణ పత్రాన్ని పొందాలనుకుంటే.. మీరు తప్పనిసరిగా పట్వారీ ఇచ్చిన సర్టిఫికెట్ అవసరమవుతంది. ఇది లేకుండా మీ పని అసంపూర్ణంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..




